మామిడి

మామిడి మిడ్జ్

Procontarinia

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులు, మొగ్గలు, రెమ్మలు మరియు లేత పండ్లను చిన్న చిన్న మొటిమలలాంటి మచ్చలు కప్పి వేస్తాయి.
  • నిష్క్రమణ రంధ్రాలు ఆకుల క్రింద మరియు పండ్ల కాండం మీద కనిపిస్తాయి.
  • ఆకులు వికృతంగా మారి ముందుగానే రాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

మామిడి

లక్షణాలు

లక్షణాలు ప్రధానంగా ఆకులపై కనిపిస్తాయి, కానీ అప్పుడప్పుడు మొగ్గలు, పుష్పగుచ్ఛాలు మరియు చెట్ల పైన లేత మామిడి పండ్లపై కూడా కనిపిస్తాయి. ఈ మిడ్జ్ ద్వారా సోకిన భాగాలు చాలా చిన్న, పెరిగిన గాల్స్ లేదా పొక్కులతో కప్పబడి ఉంటాయి. ప్రతి మొటిమ లాంటి పొక్కు లేదా గాల్ 3-4 మిమీ పరిమాణంలో ఉంటుంది మరియు పసుపు లార్వాను కలిగి ఉంటుంది. ఈ లార్వా చెట్ల కణజాలాన్ని భుజిస్తుంది. ప్రారంభ దశలో, గుడ్డు నిక్షేపణ యొక్క ప్రదేశం చిన్న ఎర్రటి మచ్చగా కనిపిస్తుంది. ఎక్కువగా ప్రభావితమైన ఆకులు వైకల్యం చెందుతాయి, కిరణజన్య సంయోగక్రియ తగ్గుతుంది. ఆకులు ముందుగానే రాలిపోతాయి. తెగులు సోకిన పుష్పగుచ్ఛాలు విచ్చుకోలేకపోవచ్చు. ఆకుల దిగువ భాగంలో ఉన్న చిన్న నిష్క్రమణ రంధ్రాలు లార్వా ఉనికిని చాటే అవశేషాలు కనపడతాయి. ఈ నిష్క్రమణ గాయాలు ద్వితీయ ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. లేత పండ్లు కూడా కాండం మొదలు వద్ద నిష్క్రమణ రంధ్రాలను ప్రదర్శిస్తాయి. తీవ్రంగా తెగులు సోకిన మామిడి రెమ్మలకు పూత ఉండదు, కావున ఇది దిగుబడిని గణనీయంగా తగ్గిస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

వెబ్‌వార్మ్, టెట్రాస్టిచస్ ఎస్ పి . ప్రోకాంటారినియా sp యొక్క లార్వాపై పరాన్నజీవులుగ ప్రవర్తిస్తాయి కాబట్టి వాటిని తెగులును నియంత్రించడానికి ఉపయోగించవచ్చు. ప్లాటిగాస్టర్ ఎస్ పి. , అప్రోస్టోసెటస్ ఎస్ పి పి., మరియు సిస్టాసిస్ డాస్నియురే కుటుంబానికి చెందిన ఇతర పరాన్నజీవులు. చెట్టు పందిరిపై వేప విత్తన సారాన్ని వాడండి .

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, జీవ చికిత్సలతో కూడిన నివారణ చర్యలతో సమగ్ర విధానాన్ని ఎల్లప్పుడూ ఎంచుకోండి. పురుగుమందుల అధిక వినియోగం ప్రతిఘటనకు కారణం కావచ్చు మరియు సహజ శత్రువులను చంపుతుంది. పుష్పగుచ్ఛము యొక్క మొగ్గ వికసించే దశలో 0.05% ఫెనిట్రోథియాన్, 0.045% డైమెథోయేట్ చల్లడం తెగులును నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. నీటితో కలిపిన బైఫెంత్రిన్ (100 లీటర్ల నీటికి 70 మిల్లీలీటర్లు) ఆకులపై పిచికారీ చేసినా కూడా సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తుంది. పిందెలు బఠానీ పరిమాణానికి చేరుకునే వరకు పిచికారీ చేస్తూ పుష్పించే కాలంలో 7-10 రోజుల వ్యవధిలో పునరావృతం చేయాలి. ప్రోకోంటారినియా ఎస్ పి జనాభాను తగ్గించడానికి డైమెథోయేట్ కలిగిన స్ప్రేలు కూడా ఉపయోగించబడ్డాయి.

దీనికి కారణమేమిటి?

లక్షణాలు వివిధ జాతుల మిడ్జ్ పురుగు జాతులు వలన సంభవిస్తాయి. ప్రోకోంటారినియా మిడ్జెస్ పూర్తిగా ఎదిగినవి 1-2 మిమీ పరిమాణంలో ఉంటాయి మరియు గుడ్డు నిక్షేపణ తర్వాత ఉద్భవించిన 24 గంటలలోపు చనిపోతాయి. గుడ్లు దాదాపు అన్ని చెట్ల భాగాలపై వేయబడతాయి, కాని అవి ప్రధానంగా ఆకులపై కనిపిస్తాయి. అవి పొదిగినప్పుడు, లార్వా కణజాలంలోకి చొచ్చుకుపోయి, అవి ప్రభావితం చేసే అవయవాన్ని బట్టి నష్టాన్ని కలిగిస్తాయి. విస్తృతంగా తినబడడంవలన పూల భాగాలు ఎండిపోయి నేలమీద పడతాయి. పరిపక్వ లార్వా ఎగువ నేల పొరలపై పడతాయి, అక్కడ అవి ప్యూపా దశలోకి ప్రవేశిస్తాయి. ఎదిగిన పురుగులు సాధారణంగా మధ్యాహ్నం బైటకి వస్తాయి మరియు చల్లని ఉష్ణోగ్రతలు (20°C) మరియు 60-82% సాపేక్ష ఆర్ద్రత అనుకూలంగా ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో జనవరి నుండి మార్చి వరకు 3-4 తెగులు తరాల వరకు ఉండవచ్చు.


నివారణా చర్యలు

  • తట్టుకునే లేదా నిరోధక చెట్ల రకాలను పండించండి.
  • మిడ్జ్‌లతో ముట్టడి సంకేతాల కోసం పొలాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • ముఖ్యంగా జనాభా దట్టంగా లేకుంటే కీటకాన్ని చేతితో ఏరివేయండి.
  • పొలంలో శిధిలాలు మరియు విరిగిన కొమ్మలు లేకుండా చూసుకోండి.
  • పొలాలలో మరియు చుట్టుపక్కల కలుపు మొక్కలను క్రమం తప్పకుండా తొలగించండి.
  • సీజన్లో, సోకిన కొమ్మలను తుంచి వేయండి.
  • జనాభా స్థాయిలను తగ్గించడానికి మీ మామిడి తోటలో అంతర పంటను నాటండి.
  • పురుగులను పట్టుకోవడానికి పసుపు జిగురు ఉచ్చులు ఉపయోగించండి.
  • లార్వా నేలమీద పడకుండా లేదా ప్యూపా వాటి గూడు నుండి బయటకు రాకుండా ప్లాస్టిక్ రేకుతో మట్టిని కప్పండి.
  • ప్యూపా మరియు లార్వాలను సూర్యుడికి బహిర్గతం చేయడానికి క్రమం తప్పకుండా మట్టిని దున్నడంవల్ల అవి చనిపోతాయి.
  • సీజన్లో, సోకిన చెట్ల పదార్థాన్ని సేకరించి వాటిని కాల్చండి.
  • తెగులు సోకిన మొక్కలను లేదా పండ్లను కొత్త ప్రాంతాలకు లేదా మార్కెట్లకు రవాణా చేయవద్దు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి