క్యాబేజీ

క్యాబేజీ వెబ్‌వార్మ్

Hellula undalis

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • క్యాబేజీ ఆకులపై విస్తృతమైన గూళ్ళు మరియు మల పదార్ధం కనపడతాయి.
  • కొన చిగుర్లు నాశనం అవుతాయి.
  • ఆకుల సమూహాలు చిన్నగా ఉంటాయి.
  • పెద్ద పురుగు అలలవంటి చారలతో, బూడిద-గోధుమ రంగులో ఉంటుంది.
  • కాండం వెంబడి సొరంగం ప్రవేశద్వారం వద్ద మలపదార్ధం పేరుకుపోతుంది.

లో కూడా చూడవచ్చు

2 పంటలు
క్యాబేజీ
కాలీఫ్లవర్

క్యాబేజీ

లక్షణాలు

గొంగళి పురుగుల వలన మొలకలు నాశనమవుతాయి. చిన్న గొంగళి పురుగులు ఆకులను తిని కాడలు, కొమ్మ, ఆకు మరియు ఈనెలకు రంధ్రాలు చేస్తాయి. ఇవి ఆకులను బాహ్యంగా తింటాయి. క్యాబేజీ తలపై లార్వా రంధ్రాలు చేసి తరచుగా మొక్క మధ్యభాగంలోనికి చొచ్చుకుపోయి చివరి మొగ్గను నాశనం చేస్తుంది, తద్వారా క్యాబేజీ ఎదుగుదలను నివారిస్తుంది. పెద్ద క్యాబేజీ మొక్కలలో కొత్త రెమ్మలు ఉత్పత్తి చేయబడతాయి మరియు దాడికి గురైన మొక్కలు తక్కువ వాణిజ్య విలువ కలిగిన అనేక చిన్న క్యాబేజీలను ఉత్పత్తి చేస్తాయి. గొంగళి పురుగు తలను తినడం కారణంగా ఎదుగుదల తగ్గిపోవచ్చు. ఇవి తినేటప్పుడు పట్టు లాంటి గొట్టాన్ని నేస్తాయి. మొక్కలు వాడిపోతాయి మరియు వీటి ప్రభావానికి గురైన మొక్కల భాగాల నుండి మలపదార్ధం వెలువడుతుంది. తెగులు సోకిన మొక్కలలో తరచుగా అనేక చిన్న ఆకుల గుంపులు ఉంటాయి, ఇవి మధ్యలో ఉండే మొగ్గ దెబ్బతినడం మరియు పక్క రెమ్మల వృద్ధి వలన ఏర్పడతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

బ్రాకోనిడ్, ఇచ్న్యుమోనిడ్ మరియు చాల్సిడోయిడ్ కందిరీగలు వంటి పరాన్నజీవి కందిరీగలను పొలంలో ప్రవేశపెట్టండి. బాసిల్లస్ తురింజెన్సిస్ సిఫార్సు చేయబడింది మరియు లార్వాలు వాటి పట్టు గూళ్ళ ద్వారా రక్షించబడడానికి ముందు మరియు అవి క్యాబేజీల మధ్యలోకి ప్రవేశించకముందు దీనిని వాడాలి. వారం వారం వేపను వాడడం కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులు నుండి మీ మొక్కలను రక్షించడానికి పురుగుమందుల వాడకం కష్టం, ఎందుకంటే ఇవి గూళ్ళలో ఉండడం లేదా పంటల్లోకి రంధ్రాలు చేసి లోపల దూరిపోవడం ద్వారా రక్షించబడతాయి. 8-10 రోజుల వ్యవధిలో ఎసిఫేట్ మరియు పెర్మెత్రిన్ ఉపయోగించండి. మొక్కలపై మొదటగా తెగులు కనిపించినప్పుడు కార్బమేట్స్ మరియు ఆర్గానో-ఫాస్ఫేట్లు ఈ పురుగులను నియంత్రించాయి.

దీనికి కారణమేమిటి?

ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండలాలలో అగ్రస్థానంలో ఉన్న బ్రాసికా కుటుంబ (క్యాబేజీ, కాలీఫ్లవర్) పంటలలో హెల్లూలా ఉండాలిస్ యొక్క చిన్న గొంగళి పురుగులు తినడం ఫలితంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి. గుడ్లు అండాకారంలో ఉంటాయి మరియు వాటిని ఒక్కొక్కటిగా లేదా సమూహాలలో, కొన్నిసార్లు గొలుసులుగా పెడతాయి. సుమారు మూడు రోజుల తరువాత గుడ్లు పొదగబడతాయి మరియు ఐదు వృద్ధి దశల తరువాత, అవి బూడిద-పసుపు మరియు గులాబీ రంగు రేఖాంశ చారలతో పరిపక్వం చెందుతాయి. గొంగళి పురుగులు మీగడ వంటి తెల్లటి రంగులో ఉంటాయి. ఇవి శరీరమంతా లేత గులాబీ గోధుమ రంగు గీతలతో ఉంటాయి మరియు నల్లటి తలను కలిగి ఉంటాయి. పరిపక్వ గొంగళి పురుగులు పాలిపోయిన చారలను కలిగి ఉంటాయి. చివరి దశలో, గొంగళి పురుగులు 12-15 మి.మీ పొడవు ఉండి పట్టులాంటి గూళ్ళ నుండి వచ్చి తింటాయి. సాధారణంగా ముందు రెక్కలు బూడిద-గోధుమ రంగులో అలలు లాంటి గీతలు మరియు నల్లని మచ్చతో ఉంటాయి. పెద్ద పురుగులు బూడిద-గోధుమరంగులో ఉంటాయి, చిన్నవి సున్నితంగా ఉంటాయి. రెక్కలు 18 మిమీ వరకు వెడల్పుతో ఉంటాయి. ఇవి బైటకి రావడం మరియు సంభోగం తరువాత, 3 నుండి 10 రోజులలో ఆడ పురుగులు 150 లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు పెడతాయి. పెద్ద పురుగులు చాలా దూరం ఎగిరే సామర్ధ్యం కలిగివుంటుంది.


నివారణా చర్యలు

  • శుభ్రమైన నాటే పదార్థాలను వాడండి మరియు ఆరోగ్యకరమైన, శక్తివంతమైన క్రిములు లేని మొలకలని మాత్రమే నాటండి.
  • మీ బ్రాసికా పంట వరుసల మధ్య ఆవాలు (బ్రాసికా జున్సియా) లేదా చైనీస్ క్యాబేజీ (బోక్ చోయ్) వంటి ఉచ్చు పంటలను నాటండి.
  • మీ పంటను నాటడానికి 15 రోజుల ముందు మొదటి వరుస ఉచ్చు పంటలను నాటాలి, నాటిన 25 రోజుల తరువాత రెండవ వరుస ఉచ్చు పంటలను నాటాలి.
  • నర్సరీలో మరియు పొలంలో నాటిన తర్వాత లేత మొక్కలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • మీ పొలాన్ని కలుపు మొక్కలు లేకుండా ఉంచండి.
  • గొంగళి పురుగులు మరియు దెబ్బతిన్న లక్షణాల కోసం పంటను పరిశీలించండి.
  • పొలంలో మంచి పారిశుధ్యాన్ని పాటించండి.
  • క్యాబేజీ మరియు కాలే పెకిలించి కాల్చివేయండి.
  • చీడ పురుగుల జనాభాను తగ్గించడానికి పంట మార్పిడి ముఖ్యం.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి