క్యాబేజీ

బగ్రడా నల్లి

Bagrada hilaris

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • పేపర్ లాంటి తెల్లటి ప్యాచీలు.
  • ఆకులు వాడిపోవడం పసుపు రంగులోకి మారడం మరియు ఎండిపోవడం జరుగుతుంది.
  • ఎదుగుదల కుంటుపడుతుంది.

లో కూడా చూడవచ్చు

5 పంటలు
క్యాబేజీ
కాలీఫ్లవర్
వంకాయ
బెండ
మరిన్ని

క్యాబేజీ

లక్షణాలు

ఇవి ఆకులు, కాండం, పువ్వులను తింటాయి. ఇవి తినడం వలన ఆకులకు రెండు వైపులా తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. పలుచని ఆకులపై కాగితం లాంటి తెల్లటి మచ్చలు ఏర్పడవచ్చు. వ్యాధి సోకిన మొక్కలు వాడిపోవడం, పసుపు రంగులోకి మారడం, ఆకులు ఎండిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మొక్క యొక్క ఎదిగే భాగాలు చనిపోతాయి, మరియు లేత మొక్కలు చనిపొవచ్చు. దీని ఫలితంగా ఫలితంగా మొక్కలు చనిపోతాయి. పంట కోతల తర్వాత కూడా ఇది ప్రభావం చూపుతుంది. మొక్కల ఎదుగుదల తగ్గి చిన్న పరిమాణంలో, అమ్మడానికి పనికిరాని క్యాబేజీ పువ్వులు పెరుగుతాయి లేదా అసలు క్యాబేజీ పువ్వులు ఏర్పడకపోవచ్చు. ("బ్లైండ్" మొక్కలుగా సూచిస్తారు). పెద్ద నల్లులు మరియు చిన్న నల్లులు, రెండూ కూడా అన్ని మొక్కల భాగాల నుండి రసాన్ని పీల్చుతాయి. పెద్ద నల్లులు పంటను పాడుచేసే జిగురు పదార్థాన్ని కూడా విడుదల చేస్తాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

అనేక కీటకాలు గ్రియోన్, ఓయెన్సైర్టస్, టెలినోమస్ మరియు ట్రిస్సోల్కస్ వంటి బాగ్రడా హిలారిస్ గుడ్లకు పరాన్నజీవులు. పెద్ద నల్లులను ఈగలు మరియు సాలెపురుగుల వీటి పరాన్నజీవులు. సబ్బు మరియు సబ్బు ద్రావణాల పిచికారీ కూడా తెగులుకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు కనుగొనబడింది. మిరప, సబ్బు, వెల్లుల్లి మరియు పారాఫిన్ కలిపి మీ పంటలపై పిచికారీ చేయండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. ఇమిడాక్లోప్రిడ్ తో శుద్ధి చేసిన విత్తనాలను విత్తండి. మధ్యాహ్న సమయంలో మరియు సాయంత్రం ప్రారంభంలో లేత మొలకలపై ఆకులపై స్పర్శ ఆధారిత క్రిమిసంహారక మందులను పిచికారీ చేయండి. ఈ తెగులుకు వ్యతిరేకంగా పైరెథ్రాయిడ్‌లు, పైరిత్రిన్, నియోనికోటినాయిడ్స్ మరియు ఆర్గానోఫాస్ఫేట్ ప్రభావవంతంగా పనిచేస్తాయి.

దీనికి కారణమేమిటి?

బగ్రదా హిలారిస్ యొక్క పెద్ద నల్లులు మరియు చిన్న నల్లుల వలన నష్టం జరుగుతుంది, బగ్రదా లేదా పెయింటెడ్ బగ్ అని పిలవబడే పెద్ద నల్లి నల్లగా ఉంటుంది మరియు దాని శరీరంపై తెలుపు మరియు నారింజ చారలను కలిగి ఉంటుంది, ఇది షీల్డ్ ఆకారంలో ఉంటుంది. ఇది 5-7 మిల్లీమీటర్లు పొడవు ఉంటుంది. ఇవి తమ గుడ్లను ఆకులపై లేదా మొక్కల సమీపంలోని మట్టిలో గుంపులుగా పెడతాయి. ప్రారంభంలో, చిన్న నల్లులకు రెక్కలు ఉండవు మరియు ఇవి ప్రకాశవంతమైన నారింజ రంగులో ఉంటాయి. ఇవి ఎదిగేకొద్దీ ఎరుపు రంగులోకి మారుతాయి మరియు అవి పెద్దవిగా ఎదిగేవరకు ముదురు చారలను కలిగివుంటాయి. ఇవి ప్రధానంగా క్యాబేజీ, కాలీఫ్లవర్ మరియు కాలే వంటి బ్రాసికా కుటుంబానికి చెందిన మొక్కలను ప్రభావితం చేస్తాయి. ఈ మొక్కలు తరచుగా వేడి వాతావరణానికి మరియు నీటి ఎద్దడికి ప్రభావితమవుతాయి. ఆకుల నుండి రసాన్ని పీల్చడం మరియు వాటిని పెద్ద సంఖ్యలో సోకడం ద్వారా ఈ కీటకాలు మొక్కలకు హాని చేస్తాయి.


నివారణా చర్యలు

  • నాటడానికి ముందు ఈ తెగులు కోసం మీ పొలాన్ని మరియు పరిసర ప్రాంతాలను పర్యవేక్షించండి.
  • నాటిన తర్వాత, రోజులో వేడిగా ఉండే సమయాల్లో క్రమం తప్పకుండా పర్యవేక్షణ కొనసాగించండి.
  • శుభ్రమైన, అంటువ్యాధులు లేని అంటుమొక్కలను మాత్రమే నాటండి.
  • మొలకలను రక్షించడానికి సూక్ష్మ రంధ్రాలు కల నెట్ మెటీరియల్ వంటి రక్షణ కవర్లను ఉపయోగించవచ్చు.
  • మీ పొలంలో పంట అవశేషాలు మరియు కలుపు మొక్కలను తొలగించి నాశనం చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి