ఆపిల్

శాన్-జోస్-పొలుసు

Comstockaspis perniciosa

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఇవి తిన్న ప్రాంత చుట్టూ కొద్దిగా నొక్కుకుపోయినట్టు అయ్యి ఎరుపు నుండి ఊదా రంగు మచ్చలు ఏర్పడతాయి.
  • చిన్న పరిమాణంలో, వైకల్యం చెందిన మరియు నిస్తేజమైన రంగు గల పండ్లు ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు

4 పంటలు
ఆపిల్
అప్రికోట్
పీచ్
పియర్

ఆపిల్

లక్షణాలు

పొలుసు పురుగు కొమ్మలు, ఆకులు మరియు పండ్ల నుండి స్రావాన్ని పీలుస్తుంది. ఈ తినే అలవాటు పండ్ల ఉపరితలంపై ఎరుపు నుండి ఊదా రంగు వలయాలతో కొద్దిగా నొక్కుకుపోయినట్టు వున్న మచ్చలకు దారితీస్తుంది. ఒకే పొలుసు పురుగు ఎక్కువ నష్టాన్ని కలిగించలేనప్పటికీ, ఒకే ఆడ పురుగు మరియు దాని సంతానం ఒక సీజన్‌లో అనేక వేల పొలుసు పురుగులను ఉత్పత్తి చేయగలవు. ఈ కీటకాలు ముఖ్యంగామంచి పిచికారీ కవరేజ్ సాధించడం కష్టమైన పెద్ద చెట్లలో నివసిస్తాయి, కాని చిన్న, పిచికారీ చేయబడిన చెట్లు కూడా వీటి ముట్టడికి గురవుతాయి. ఇవి ప్రధానంగా చెట్ల బెరడులో నివసిస్తున్నప్పటికీ, పొలుసుల క్రింద మరియు పగుళ్లలో జీవించి ఉన్నప్పటికీ, పండ్ల తోటలో మొదటి సూచన పండ్లు మరియు ఆకులపై చిన్న ఎర్రటి మచ్చలు కావచ్చు. సాధారణంగా పండు దిగువన నష్టం కేంద్రీకృతమై ఉంటుంది. సీజన్ ప్రారంభంలో ముట్టడి సంభవిస్తే, పండు చిన్నదిగా లేదా వైకల్యంగా మారవచ్చు. ఇది మొక్కల శక్తి, పెరుగుదల మరియు దిగుబడిలో మొత్తం క్షీణతకు దారితీస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

చిలోకోరస్ స్టిగ్మా లేడీ బీటిల్ లేదా సైబోసెఫాలస్ కాలిఫోర్నికస్ వంటి శాన్ జోస్ పొలుసు పురుగులను ఆహారంగా తినే సహజ శత్రువులను పొలంలో పరిచయం చేయండి. అదనంగా, కొన్ని చిన్న చాల్సిడ్లు మరియు అఫెలినిడ్ కందిరీగలు ఈ పొలుసు పురుగుల పరాన్నజీవిగా ఉంటాయి. మొగ్గ విచ్చుకునే ముందు లేదా విచ్చుకున్న తర్వాత కాని పువ్వులు కాయలుగా మారే ముందు 2% ఉద్యాన నూనెను పిచికారీ చేయండి. అఫిటిస్ ఎస్.పి.పి., ఎన్కార్సియా పెర్నిసియోసి మరియు కోకినెల్లా ఇన్ఫెర్నాలిస్ ముల్సంట్ జీవ నియంత్రణ ఏజెంట్లుగా ప్రయోజనం చేకూరుస్తాయి. వసంత ఋతువులో, తెగులు సోకిన ప్రాంతాల్లో, తెగులు సోకిన చెట్లకు ఒకసారి ఎన్‌కార్సియా పెర్నిసియస్ 2000 వంటి పరాన్నజీవులను విడుదల చేయండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఆలస్యమైన నిద్రాణ సమయాల్లో పురుగుమందు మరియు ఆయిల్ స్ప్రేను ఉపయోగించడం ద్వారా అధిక జనాభాను నియంత్రించండి. మీరు లింగాకర్షక బుట్టలలో ఒకసారి పెద్ద పురుగులను చూసినప్పుడు లేదా జిగురు టేపులపై మొదటి సారి పాకే పురుగులను గమనించినప్పుడు, పైరీప్రాక్సిఫెన్ లేదా బుప్రోఫెజిన్, నియోనికోటినాయిడ్స్, ఆర్గానోఫాస్ఫేట్లు లేదా స్పిరోటెట్రామాట్ వంటి పురుగుల ఎదుగుదల నియంత్రకాలను కలిగి ఉన్న పురుగుమందులను వాడండి. చురుకుగా వున్న పాకే పురుగులు మీకు కనపడడం కొనసాగితె 10 రోజుల తరువాత మళ్ళీ ఈ మందులను పిచికారీ చేయండి.

దీనికి కారణమేమిటి?

శాన్ జోస్ పొలుసు పురుగు అనే పండ్ల చెట్టు తెగులు వలన నష్టం జరుగుతుంది. ఆడ పురుగులు పసుపు రంగులో ఉండి, రెక్కలు లేకుండా మృదువుగా గోళాకారంలో ఉంటాయి. ఇవి వెనుక వైపు ముదురు రంగు బ్యాండ్‌తో 1.5-2.2 మి.మీ పొడవు ఉంటాయి. పిల్ల పురుగులు, పాకడం , తెల్ల క్యాప్ మరియు నల్ల క్యాప్ అనే మూడు దశలు కలిగి ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం రెండు తరాల పురుగులతో సుమారు 37 రోజుల్లో దీని జీవిత చక్రాన్ని పూర్తి చేయగలదు. వసంతకాలంలో ఉష్ణోగ్రతలు 51°F దాటినప్పుడు పురుగుల వృద్ధి తిరిగి ప్రారంభమవుతుంది. మార్చి మధ్యలో పిల్ల పురుగులు బాగా చురుకుగా మారతాయి మరియు మగ పురుగులు ఏప్రిల్‌లో బయటకు వస్తాయి. ఆడ పురుగులు వాటి లోపలే పిల్లలను పుట్టించి ఒక నెలలో 200 మరియు 400 పిల్ల పురుగులను పునరుత్పత్తి చేస్తారు. ఒక సాధారణ జీవిత చక్రం 35-40 రోజులలో పూర్తవుతుంది, మరియు పుష్పించే కాలంలో కీటకాలు పెరగడం ప్రారంభిస్తాయి. ఆడ పొలుసు పురుగు గుండ్రంగా ఉంటుంది, నల్లని స్ఫోటముతో కొద్దిగా కుంభాకారంగా ఉంటుంది, అయితే మగ పురుగు సన్నగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • తోటలో శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
  • ప్రత్యామ్నాయ అతిథేయ మొక్కలు, కలుపు మొక్కలు, స్వచ్ఛంద మొక్కలు మరియు పంట అవశేషాలను తొలగించడం వలన సంక్రమణ సామర్థ్యాన్ని బాగా తగ్గిస్తుంది.
  • భారీగా తెగులు సోకిన కొమ్మలను కత్తిరించి, కాల్చి, నాశనం చేయాలి.
  • తెగులు స్థాయిని తెలుసుకోవడానికి నిద్రాణ సమయంలో చెట్లను జాగ్రత్తగా పరిశీలించండి.
  • శీతాకాలంలో ఆకులను నిలుపుకునే చెట్ల కోసం చూడండి, ఎందుకంటే ఇది క్రిమి ఉనికికి మంచి సూచన.
  • మగ పురుగులను ఉనికిని గుర్తించడానికి లింగాకర్షక బుట్టలను ఉపయోగించండి.
  • ఆరు నుండి ఏడు అడుగుల ఎత్తులో చెట్ల ఉత్తరం మరియు తూర్పు వైపు ఉచ్చులు ఉంచండి మరియు వారానికొకసారి తనిఖీ చేయండి.
  • జనాభాను తగ్గించడానికి మరియు పిచికారీ ప్రవేశాన్ని మెరుగుపరచడానికి తెగులు సోకిన కొమ్మ లను కత్తిరించాలి.
  • మొగ్గలు గులాబీ రంగులోకి మారడానికి ముందు, ఆకుపచ్చ సమస్యలను చూపిస్తున్నప్పుడు దిలేయ్డ్ డార్మెంట్ నూనెను పిచికారీ చేయండి.
  • పురుగుమందుల వాడకం వేసవి ప్రారంభంలో కొత్తగా ఉద్భవించిన క్రాలర్లను నియంత్రించగలవు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి