ద్రాక్ష

రోజ్ ఛాఫర్

Macrodactylus subspinosus

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • పువ్వులు మరియు ఆకులను పురుగులు తినడం వల్ల రంధ్రాలు ఏర్పడుతాయి.
  • ఆకుల ఈనెలు మాత్రం మిగిలి అస్థిపంజరం వలే మారుతాయి.
  • పండ్లు కూడా దెబ్బతినవచ్చు.

లో కూడా చూడవచ్చు

2 పంటలు
ద్రాక్ష
గులాబీ

ద్రాక్ష

లక్షణాలు

ప్రభావితమైన పంటను బట్టి లక్షణాలు భిన్నంగా ఉంటాయి. గులాబీ మొక్కల్లో వికసించే పువ్వులు ప్రభావితమవుతాయి. దీని వలన పూరేకుల్లో పెద్ద పరిమాణంలో సక్రమంగా లేని రంధ్రాలు ఏర్పడతాయి. పండ్ల చెట్లపై, ముఖ్యంగా ద్రాక్ష ఆకులను తింటాయి. చివరికి ఆకులను అస్థిపంజరంలా చేస్తాయి. అలాగే, పైతొక్క పాక్షికంగా ఒలవబడి, క్రమరహితంగా వున్న లోతు లేని ప్యాచీల వలన పండ్లు కూడా దెబ్బతినవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

లార్వాలను చంపడానికి పరాన్నజీవి నెమటోడ్‌తో మట్టిని తడపండి. సంక్రమణ స్థాయి తీవ్రంగా ఉంటే పైరెత్రిన్ సిఫార్సు చేయబడింది.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవసంబంధమైన చికిత్సలతో పాటు నివారణా చర్యలతో కూడిన సమగ్ర సస్యరక్షణ విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. మీ ద్రాక్షతోటలో ఎకరాకు 600-800 లీటర్ల నీటిలో 400 మి.లీ మలాథియాన్ 50% యి సి ను కలిపి వాడండి. అసిఫేట్, క్లోర్‌ఫైరిఫాస్, బైఫెంట్రిన్, సైఫ్లుత్రిన్ లేదా ఇమిడాక్లోప్రిడ్ కలిగి వున్న ఇతర పురుగుమందులు సిఫారసు చేయబడ్డాయి. తేనెటీగలకు హాని కలిగకుండా లేదా చనిపోకుండా ఉండడానికి పూలపై పిచికారీ చేయకండి

దీనికి కారణమేమిటి?

మాక్రోడాక్టిలస్ సబ్‌స్పినోసస్ యొక్క పెద్ద చాఫర్ వల్ల నష్టం జరుగుతుంది. ఇవి ముదురు రంగు తల మరియు పొడవాటి కాళ్లతో సన్నగా వుండే లేత ఆకుపచ్చ రంగు పెంకు పురుగులు. ఇవి 12 మిమీ పొడవు ఉంటాయి. ఆడ పెంకు పురుగు, నేల ఉపరితలం క్రింద గడ్డితో వున్న, బాగా నీరు ఇంకే ఇసుక నేలలో గుడ్లను పెడుతుంది. ఇవి గుడ్లు పెట్టడానికి తడి నేలలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. శీతాకాలమంతా లార్వా మట్టిలో గ్రబ్ లాగ జీవిస్తుంది మరియు గడ్డి వేర్లను తింటుంది. ఇది గులాబీలు, స్టోన్ ఫ్రూట్ చెట్లు, ఉదా. ద్రాక్ష, ఆపిల్, చెర్రీస్, పీచెస్, పియర్స్ మరియు మరియు ప్లమ్ పండ్లను ప్రభావితం చేస్తుంది మరియు ఇసుక నేలకు ప్రాధాన్యం ఇస్తాయి.


నివారణా చర్యలు

  • పెంకు పురుగుల కోసం మరియు ఇవి తినడం వలన కలిగిన నష్టం కోసం మీ పంటను వారానికి రెండుసార్లు పర్యవేక్షించండి.
  • కాక్‌చాఫర్ల సంఖ్య తక్కువగా ఉంటే, చేతితో వీటిని తొలగించి వాటిని ఒక బకెట్ సబ్బు నీటిలో వేయండి.పెద్ద పెంకు పురుగులను దూరంగా ఉంచడానికి మీ ద్రాక్షతోటలో చీజ్‌క్లాత్‌లు లేదా ఫ్లోటింగ్ రో కవర్‌ను ఉంచండి.
  • అది మీ పంటను పెద్ద పురుగుల నుండి కాపాడడంలో సహాయపడుతుంది కానీ మట్టిలో నివసించే గ్రబ్స్‌ నుండి ఇవి రక్షణను ఇవ్వవు.
  • ద్రాక్షతోట నుండి దూరంగా లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయండి.
  • మట్టిని దున్నడం ద్వారా లార్వా నిద్రాణస్థితి ప్రదేశాలను తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి