ద్రాక్ష

కాక్‌చాఫర్

Melolontha melolontha

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులు వాడిపోవడం మరియు పసుపు రంగులోకి మారడం.
  • వేరు నష్టం.
  • పంట దిగుబడి తగ్గుతుంది.

లో కూడా చూడవచ్చు


ద్రాక్ష

లక్షణాలు

గ్రబ్స్ వేరు రూట్‌లెట్స్‌ను దెబ్బతీస్తాయి, దీని వలన మొక్కలు వాడిపోతాయి మరియు మొక్క పందిరి పసుపు రంగులోకి మారుతుంది. ఇవి వేర్లను నాశనం చేయవచ్చు. దీనివలన ద్రాక్ష మొక్క తీగలు పూర్తిగా నాశనం అవుతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

పురుగులు, గబ్బిలాలు, కోకిలలు, వడ్రంగి పిట్టలు, పిచ్చుకలు, నేల బీటిల్స్, పెద్ద కందిరీగలు మరియు టాచినిడ్ ఫ్లైస్ వంటి సహజ శత్రువులను సంరక్షించండి. బవేరియా బాసియానా లేదా మెటార్జిజియం అనిసోప్లియా వంటి వ్యాధికారక శిలీంధ్రాలను ఉపయోగించండి. మట్టిపై వేసిన నెమటోడ్స్, హెటెరోరాబ్డిటిస్ మెగిడిస్ వంటి పరాన్నజీవులు ఈ గ్రబ్స్ ను చంపుతాయి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవసంబంధమైన చికిత్సలతో పాటు నివారణా చర్యలతో కూడిన సమగ్ర సస్యరక్షణ విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. మీ ద్రాక్షతోటలో ఎకరాకు 600-800 లీటర్ల నీటిలో 400 మి.లీ మలాథియాన్ 50% యి సి ను కలిపి వాడండి.

దీనికి కారణమేమిటి?

మేలోలోంత మెలోలోంత యొక్క పెద్ద చాఫర్ వల్ల నష్టం జరుగుతుంది. ఇవి ముదురు రంగు తలతో గోధుమ రంగులో ఉంటాయి. ఆడ పురుగు 10-20 సెంటీమీటర్ల లోతులో నేల ఉపరితలం క్రింద గుడ్లు పెడుతుంది. లార్వా తెల్లటి పసుపు రంగులో, అపారదర్శకంగా ఉండి 5 మిమీ పొడవు ఉంటుంది. పూర్తిగా పెరిగిన గ్రబ్స్ బలమైన దవడలతో బలంగా ఉంటాయి. వీటి తల పసుపురంగులో ఉంటుంది మరియు మెరిసే తెల్లటి రంగు శరీరం కలిగి 'C' ఆకారంలో ఉంటుంది. లార్వా గ్రబ్ లాగ మట్టిలో శీతాకాలంలో మనుగడ సాగిస్తుంది మొక్కల వేర్లను తింటుంది. వీటి జీవిత చక్రం 3-4 సంవత్సరాలు ఉంటుంది. మూడవ ఇన్‌స్టార్ లార్వా చాలా విపరీతంగా తిని మొక్కలకు బాగా నష్టం కలిగిస్తుంది. వేర్లు తినబడతాయి మరియు రంద్రాలు చేయబడతాయి. దీని వలన మొక్కల పైభాగాలు వాడిపోయి చనిపోతాయి. పెద్ద పురుగులు పగటిపూట విశ్రాంతి తీసుకుంటాయి మరియు సాయంత్రం సమయంలో అవి తినే ప్రాంతాల వద్దకు ఎగిరి వెళతాయి.


నివారణా చర్యలు

  • పెంకు పురుగుల ఉనికి మరియు ఇవి తినడం వలన కలిగిన నష్టం కోసం మీ పంటను వారానికి రెండుసార్లు పరిశీలిస్తూ ఉండండి.
  • కాక్‌చాఫర్ల సంఖ్య తక్కువగా ఉంటే, చేతితో వీటిని తొలగించి వాటిని ఒక బకెట్ సబ్బు నీటిలో వేయండి.పెద్ద పెంకు పురుగులను దూరంగా ఉంచడానికి మీ ద్రాక్షతోట చుట్టూ ఉన్ని లాంటి అడ్డంకులను ఉంచండి.
  • దీపపు ఎరలను స్థాపించండి,ఎందుకంటే అవి పెద్ద సంఖ్యలో పురుగులను ఆకర్షిస్తాయి.
  • మట్టిని దున్నడం ద్వారా లార్వా నిద్రాణస్థితి ప్రదేశాలను తొలగించండి.
  • పరాన్నజీవులు మరియు సహజ శత్రువులకు సహాయపడే పర్యావరణ పరిస్థితిని ఏర్పాటుచేయండి ఎందుకంటే అవి లార్వాను ఆహారంగా తింటాయి.
  • కొన్ని ప్రాంతాల్లో వీటిని ఆహారంగా కూడా తీసుకుంటారు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి