చెరుకు

చెరకు పొలుసు వ్యాధి

Melanaspis glomerata

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులు మరియు చెరకు ఎండిపోతుంది.
  • ఎదుగుదల తగ్గిపోతుంది.
  • వృత్తాకార, ముదురు రంగు పొలుసులతో కాండం మరియు ఆకు ప్రధాన ఈనెలు కప్పబడి వుంటాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

చెరుకు

లక్షణాలు

కాండం మరియు ఆకు ప్రధాన ఈనెలు వృత్తాకార, గోధుమరంగు లేదా బూడిద-నలుపు పొలుసులతో కప్పబడి ఉంటాయి. అనారోగ్యకరమైన పాలిపోయిన ఆకుపచ్చ రంగుతో, తెగులు సోకిన చెరకు ఆకు కొనలు ఎండిపోతాయి. తరువాత ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. కణద్రవ్యం కోల్పోవడం వలన కూడా ఆకులు తెరుచుకోవు. దీనివలన చివరికి ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి. చివరికి, చెరకు గడలు ముడతలు పడి మధ్యకి కత్తిరించినప్పుడు గోధుమ-ఎరుపు రంగులో కనిపిస్తుంది. తెగులు తీవ్రత అధికంగా ఉంటే చెరకు కుంచించుకుపోతుంది మరియు మొత్తం చెరకు తెగులుతో కప్పబడి పైన గట్టిపడుతుంది. కదలకుండా ఒకే ప్రాంతంలో ఉండడం మరియు సూక్ష్మ పరిమాణం కారణంగా రైతులు దీనిని గుర్తించలేరు తీవ్రమైన నష్టం జరిగిన తరువాత మాత్రమే దీని ఉనికి బయటపడుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

సెట్లను 1% చేప నూనె రోసిన్ సోప్ ఎమల్షన్‌లో ముంచండి. తెల్ల నూనెలను (ఆకులు మరియు కాండాలు) పిచికారీ చేయండి, ఇవి చిన్న పొలుసు పురుగులకు వ్యతిరేకంగా కొంత మేర ప్రభావాన్ని చూపుతాయి. చిలోకోరస్ నైగ్రిటస్ లేదా ఫరాస్సిమ్నస్ హార్ని ఎగ్ కార్డ్ ఎకరానికి 5 సిసి చొప్పున వదలండి. అనాబ్రోటెపిస్ మయూరాయ్, చెలోనోరస్ ఎస్ పి వంటి హైమెనోప్టెరాన్ పరాన్నజీవులను మరియు సానియోసులస్ నుడస్ మరియు టైరోఫాగస్ పుట్రెస్సెంటియా వంటి పురుగులను పొలంలో పరిచయం చేయండి. ఇవి పొలుసు పురుగులను తింటాయి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. నాటడానికి ముందు సెట్లను 0.1% మలాథియాన్ ద్రావణంలో నానబెట్టండి. ఆకులు మరియు మొక్క పైభాగాన్ని కత్తిరించిన తర్వాత డైమెథోయేట్ @ 2 మి.లీ / ఎల్ లేదా మోనోక్రోటోఫాస్ @ 1.6 మీ / ఎల్ పిచికారీ చేయాలి. ఆకులు మరియు మొక్క చిగుర్లను కత్తిరించిన తర్వాత మరియు తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే రెండుసార్లు సెట్లను ఎసిఫేట్ 75 ఎస్ పి @ 1 గ్రా / లీటర్ తో చికిత్స చేయండి.

దీనికి కారణమేమిటి?

ప్రాకే పొలుసు పురుగుల వలన నష్టం జరుగుతుంది. ఆడ పురుగులు ఓవోవివిపరస్ - అంటే ఆడ పురుగుల శరీరంలో పొదగబడిన గుడ్ల ద్వారా చిన్నపిల్లలు ఉత్పత్తి అవుతాయి. ఇవి పొదగబడిన తర్వాత, క్రాలర్లు (యువ అపరిపక్వ పొలుసు పురుగులు) ఆహారం కోసం వెతకడం మొదలుపెడతాయి. ఇవి తమ సూది లాంటి నోటి భాగాలను మొక్కకు తగిలించి మొక్కల కణద్రవ్యాన్ని పీల్చడంతో, ఇవి మళ్లీ కదలవు. కణుపులు ఏర్పడటంతో ముట్టడి మొదలవుతుంది మరియు చెరకు మొక్క పెరిగేకొద్దీ పెరుగుతూనే ఉంటుంది. తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు ఆకు తొడుగు, లామినా మరియు ప్రధాన ఈనెలకు సంక్రమిస్తుంది.


నివారణా చర్యలు

  • CO 439, CO 443, CO 453, CO 671, CO 691 మరియు CO 692 వంటి నిరోధక రకాలను వాడండి.
  • పొలుసు కీటకాలు లేని సెట్లను నాటండి.
  • పొలుసు జనాభా పెరుగుదలను ఆలస్యం చేయడానికి శుభ్రమైన నాటే పదార్థాలను ఉపయోగించండి.
  • పొలాలు మరియు గట్లను కలుపు మొక్కలు లేకుండా ఉంచండి.
  • పొలంలో నిలిచిన నీటిని బైటకి పంపండి ముట్టడి సంకేతాలు ఉన్నాయేమోనని మీ పొలాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • భారీగా తెగులు సోకిన చెరకు మొక్కలను వేర్లతోపాటూ తొలగించి కాల్చివేయండి.
  • అతిథేయులు కాని పంటతో (ఉదా.
  • గోధుమ) పంట-మార్పిడిని పరిగణలోకి తీసుకోండి.
  • నాటిన 150 మరియు 210 వ రోజు మొక్కల ఆకులు మరియు మొక్కల పైభాగాన్ని కత్తిరించండి.
  • పదేపదే రెమ్మలు వేయడాన్ని నివారించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి