నిమ్మజాతి

నిమ్మజాతి పంటలో మంచు పొలుసు పురుగులు

Unaspis citri

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • పండు మీద మగ పొలుసు పురుగుల తెల్లని ద్రవ్యరాశిని ఏర్పరచడంతో పాటు ఆకుల దిగువ భాగంలో పసుపు మచ్చలు కలిగిస్తాయి.
  • ఆకులు అకాలంగా రాలిపోతాయి.
  • కొమ్మల డైబ్యాక్ చెంది చివరికి శాఖలు చనిపోతాయి.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

సాధారణంగా చెట్టు కాండం మరియు ప్రధాన భాగాలపై తెగులు సోకుతుంది. ఇవి మరింత తీవ్రంగా మారితే కొమ్మలు, ఆకులు మరియు పండ్లు కూడా ప్రభావితమవుతాయి. దీని ఫలితంగా ఆకుల దిగువ భాగంలో పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి, ఇవి అకాలంగా రాలిపోవడం, కాడలు చనిపోవడం మరియు చివరికి కొమ్మలు చనిపోవడం జరుగుతుంది. భారీగా తెగులు సోకిన బెరడు నల్లగా నిస్తేజంగా మారి, గట్టిగా మారి చివరికి చీలిపోతుంది. ఇది శిలీంధ్రాలు చెట్టుపై మరింతగా దాడి చేయడానికి వీలు కల్పిస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

నిమ్మజాతి మంచు పొలుసు ఇప్పటికే తోపు లోపల తిష్ట ఉంటే దానిని నియంత్రించడంలో పరాన్నజీవి కందిరీగ అఫిటిస్ లింగ్నానెన్సిస్ సహాయపడుతుంది. లైమ్ సల్ఫర్ (పాలీసల్ఫైడ్ సల్ఫర్) లేదా వెట్టబుల్ సల్ఫర్ ను ఉపయోగించండి, తర్వాత లైమ్ సల్ఫర్ చల్లడం మరియు నూనె స్ప్రే చేయడం మధ్య కనీసం 30 రోజులు వదిలివేయండి. లైమ్ సల్ఫర్ అఫిటిస్ లింగ్నానెన్సిస్‌ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. చిలోకోరస్ సర్కుమ్డటస్ పెంకు పురుగు కూడా విజయవంతమైన జీవ నియంత్రణ ఏజెంట్‌గా పనిచేస్తుంది. వైట్ ఆయిల్, సబ్బు మరియు హార్టికల్చరల్ ఆయిల్ పిచికారీలు పురుగుల శ్వాస రంధ్రాలను మూసివేసి, వాటికి ఊపిరి ఆడకుండా చేసి అవి చనిపోయేటట్టు చేస్తాయి. ఆకుల దిగువన పిచికారీ చేయండి, నూనెలు తప్పనిసరిగా కీటకాలకు తాకాలి. 3-4 వారాల తర్వాత సబ్బు లేదా నూనెల రెండవ పిచికారీ అవసరం కావచ్చు. రసాయన నియంత్రణ ఏజెంట్ల వాడకం వలన జీవ నియంత్రణ ఏజెంట్ల ప్రభావం తగ్గుతుంది.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవసంబంధమైన చికిత్సలతో పాటు నివారణా చర్యలతో కూడిన సమగ్ర సస్యరక్షణ విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. మలాథియాన్ 50% నిమ్మ మంచు పొలుసు పురుగుకు వ్యతిరేకంగా ఉపయోగపడుతుంది, ఆకుల దిగువన పిచికారీ చేయండి. సింథటిక్ పైరెథ్రాయిడ్ పురుగుమందులు చురుకుగా ఉండే పిల్ల పురుగులపైనా ప్రభావవంతంగా పనిచేస్తాయి. మలాథియాన్ మరియు సింథటిక్ పైరెథ్రాయిడ్స్ వీటి సహజ శత్రువులను చంపే అవకాశం ఉంది, కనుక వీలైతే వీటి వాడకాన్ని నివారించాలి.

దీనికి కారణమేమిటి?

నిమ్మజాతి మంచు పొలుసు పురుగు (ఉనాస్పిస్ సిట్రి) పెద్ద పురుగుల వల్ల ఈ లక్షణాలు కలుగుతాయి. గుడ్డు అండాకారంలో ఉండి, ప్రకాశవంతమైన నారింజ రంగు మరియు సుమారు 0.3 మిమీ పొడవు ఉంటుంది. పెద్ద ఆడ పులుసు పురుగు1.5 నుండి 2.3 మిమీ పొడవు ఉంటుంది మరియు దాని చిన్న, ముదురు పొలుసులు పండ్లపై మురికిగా పొరబడేటట్టు భావించబడతాయి. ఆడపురుగులు వాటి నోటి భాగాలను చెట్టులోకి చొప్పించి, ఒకే చోట తిని, పునరుత్పత్తి చేస్తూ అక్కడ నుండి ఇంక కదలదు. వాటి కవచం నత్తగుల్ల షెల్ ఆకారంలో ఉంటుంది మరియు గోధుమ రంగు ఊదా నుండి నలుపు రంగులో ఉండి, బూడిదరంగు అంచుతో ఉంటుంది. పరిపక్వత వచ్చే వరకు పెంకుతో ఉన్న మగ పొలుసు పురుగులు కూడా కదలకుండా ఉంటాయి. పరిపక్వత చెందని మగ పొలుసు పురుగుల పెంకు సమాంతర ప్రక్క భాగాలు మరియు మూడు రేఖాంశ విభాగాలతో తెల్లగా ఉంటుంది, ఒక కేంద్ర మరియు రెండు క్రింది రిడ్జెస్ ను కలిగి ఉంటుంది. U. సిట్రీ మైనం మరియు కాస్ట్ స్కిన్‌లతో కూడిన రక్షణ పూతను స్రవిస్తుంది, ఇది దాని పెంకును సృష్టిస్తుంది. కీటకం చనిపోయిన తర్వాత కూడా పండ్లపై పెంకు నిలిచి ఉండి, పండ్లను వికృతంగా చేస్తుంది.


నివారణా చర్యలు

  • కొత్త తోటలలోకి ప్రవేశించే ముందు వ్యవసాయ పరికరాలను శుభ్రం చేయండి.
  • తోటలో కొత్త ప్రాంతంలోకి ప్రవేశించే ముందు మీ దుస్తులను బ్రష్ తో శుభ్రం చేసుకోండి.
  • గాలి, వ్యవసాయ పరికరాలు మరియు పొలంలోని కార్మికుల ద్వారా పిల్ల పురుగులు వ్యాప్తి చెందవచ్చు.
  • నిమ్మ జాతి మంచు పొలుసు చిన్న పురుగుల దశ మొబైల్ జీవిత దశ కాబట్టి, ఈ దశలో పంపిణీని నివారించడం చాలా ముఖ్యం.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి