పెండలం

కర్రపెండలంలో ఉల్లికోడు

Jatrophobia brasiliensis

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులపై ఉల్లికోడు ఏర్పడటం.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
పెండలం

పెండలం

లక్షణాలు

లార్వాలు తినడం వలన మొక్కలపై బుడిపెలు ఏర్పడతాయి. ఈ బుడిపెలు ఎక్కువగా ఆకుల పైభాగంలో కనిపిస్తాయి, ఇక్కడ ఈగలు గుడ్లు పెడతాయి మరియు కొన్నిసార్లు మొగ్గలు మరియు కాండం మీద కూడా ఏర్పడతాయి ఈ బుడిపెలు పసుపు-ఆకుపచ్చ నుండి ఎరుపు రంగులో ఉంటాయి మరియు శంఖాకారంలో ఉంటాయి. ఈ బుడిపెలు తెరిచి చూసినప్పుడు వీటి లోపల లార్వాతో లేదా లార్వా లేకుండా ఒక స్థూపాకార సొరంగం కనిపిస్తుంది. ఆకు కింద నుండి బుడిపెలను గమనించినట్లయితే, ఒక చిన్న రంధ్రాన్ని చూడవచ్చు. ఈ రంధ్రం ద్వారా పెద్ద ఉల్లికోడు బయటకు వస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

వీటిని గమనించడానికి లేదా సంభోగంలో అంతరాయం కలగచేయడం కోసం రంగు ఎరలను ఉపయోగించండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉన్న జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి.

దీనికి కారణమేమిటి?

జత్రోఫోబియా బ్రాసిలియెన్సిస్ వల్ల ఈ నష్టం జరుగుతుంది. చిన్న ఎగిరే కీటకాలైన ఈగలు ఆకు ఉపరితలంపై గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు పొదిగినప్పుడు, బైటకి వచ్చే లార్వా అసాధారణ సెల్యులార్ పెరుగుదలను ప్రేరేపిస్తుంది, ఇది ఆకు ఎగువ ఉపరితలంపై ఏర్పడుతుంది.


నివారణా చర్యలు

  • వీలైతే పొడి ప్రాంతాల్లో నాటండి.
  • తగినంత వెంటిలేషన్‌ కోసం మొక్కల మధ్యన తగినంత అంతరంతో బహిరంగ ప్రదేశాలలో నాటండి.
  • మొక్కల క్రింద మరియు చుట్టూ కలుపు మొక్కలను నియంత్రించండి.
  • రాలిపడిన అన్ని ఆకులను పొలం నుండి తొలగించి వాటిని కాల్చివేయండి లేదా పాతిపెట్టండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి