ద్రాక్ష

నల్ల ద్రాక్షలో తామర పురుగులు

Retithrips syriacus

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులు మరియు పండ్లపై వెండి రంగు మచ్చలు.
  • ఆకులపై బూడిద రంగు మరియు మెరిసే నల్లటి చుక్కలు (కీటకాల విసర్జన).

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ద్రాక్ష

లక్షణాలు

తామర పురుగులు మొక్కల ఆకుల నుండి రసాన్ని పీలుస్తాయి, దీని వలన ఆకులు ముడుచుకుపోవడం మరియు రాలి పోవడం జరుగుతుంది. ఆకుపై కోరలను చొప్పించడం వల్ల వెండి రంగు ప్యాచీలు కనిపిస్తాయి. ఇవి తిన్న ప్రాంతంలో పండు బూడిద రంగులోకి మారుతుంది. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పండు వికారమైన రూపంలోకి మారుతుంది మరియు సాధారణంగా అభివృద్ధి చెందదు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

జియోకోరిస్ ఓక్రోప్టెరస్ మరియు మెటాసియులస్ ఆక్సిడెంటాలిస్ (వేటాడి తినే కీటకాలు) వంటి సహజ శత్రువులను తోటలో పరిచయం చేయండి. వీటిని తినే తామర పురుగులు, పచ్చ అల్లిక రెక్కల పురుగులు, మైన్యూట్ పైరేట్ బగ్‌లు మరియు అనేక ఫైటోసీయిడ్ పురుగులు మొక్కలను తినే తామర పురుగులను నియంత్రించడంలో సహాయపడతాయి

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. పాక్షికంగా వాటి కదలిక, అవి తినే పద్దతి మరియు గుడ్లకు మరియు ప్యూపా దశలలో వాటికి వుండే రక్షణ వ్యవస్థ (లార్వా మరియు పెద్ద పురుగు దశల మధ్య సంభవించే, పూర్తి రూపాంతరాన్ని ప్రదర్శించే, కీటకాల అభివృద్ధిలో జీవిత దశలు) వలన తామర పురుగులను పురుగుమందులతో సమర్థవంతంగా నియంత్రించడం కష్టం. వి: డైమెథోయేట్ మరియు బైఫెంత్రిన్ పురుగుమందులు ప్రపంచంలోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నారు. స్పినోసాడ్ ఆధారిత ఉత్పత్తులు సేంద్రీయ నియంత్రణ సాధనాలుగా పరిగణించబడతాయి. తెగులు నిర్వహణపై ఎల్లప్పుడూ ప్రాంతీయ నిబంధనలను అనుసరించండి.

దీనికి కారణమేమిటి?

మొక్కల రసాన్ని పీల్చే పెద్ద పురుగులు మరియు లార్వా (చిన్న తామర పురుగులు) రెండింటి వల్ల నష్టం జరుగుతుంది. ఈ తామర పురుగులు గుడ్డు నుండి పొదగబడతాయి మరియు చురుకుగా ఆహారం తీసుకునే రెండు లార్వా దశల ద్వారా వృద్ధి చెందుతాయి. పెద్ద ఆడ పురుగు 1.4 నుండి 1.5 మిమీ పొడవు మరియు మగ పురుగు 1.3 మిమీ ఉంటుంది. ఇవి ముదురు రంగు నుండి నలుపు గోధుమ రంగు జాతి పురుగులు. లార్వా పొదగబడిన వెంటనే గుంపులు గుంపులుగా తినడం ప్రారంభిస్తుంది. కొత్తగా ఉద్భవించిన పెద్ద పురుగులు లేత రంగులో ఎర్రగా ఉంటాయి. తామర పురుగులు క్రింది ఆకుల ఉపరితలంపై తింటాయి కానీ వీటి ముట్టడి ఎక్కువగా ఉన్నప్పుడు, పైన ఉన్న ఆకుల ఉపరితలం పైన కూడా, ముఖ్యంగా వాతావరణం చల్లగా వుండే నెలల్లో దాడి చేస్తాయి. వెచ్చని వాతావరణ పరిస్థితుల్లో, గుడ్డు దశ నుండి పెద్ద పురుగుల దశ వరకు వీటి జీవిత చక్రం 2 వారాలలోపు పూర్తికావచ్చు.


నివారణా చర్యలు

  • ఈ తెగులు సోకే అవకాశం ఉన్న విత్తన రకాలను నాటకండి.
  • తామర పురుగుల కోసం క్రమం తప్పకుండా తోటని గమనిస్తూ ఉండండి మరియు తామర పురుగులు సంక్రమించే అవకాశం వుండే సమీపంలోని కలుపు మొక్కలను తొలగించండి.
  • మీ ప్రాంతంలోని పరిస్థితులకు బాగా అనుకూలంగా వుండే మొక్కలను పెంచండి.
  • మొక్కలను శక్తివంతంగా ఉంచడానికి మరియు తామర పురుగుల వలన కలిగే నష్టానికి సహనశీలత కలిగిఉండే విధంగా తగిన సాగు పద్దతులను ఉపయోగించండి.
  • మొక్కలకు బాగా నీరు పెట్టండి.
  • మరియు నత్రజని ఎరువును అధికంగా వాడకండి.
  • ఇది తామర పురుగుల జనాభా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి