లో కూడా చూడవచ్చు

1 పంటలు

బెండ

లక్షణాలు

గొంగళి పురుగులు ఆకులను తినడం వలన ఆకులు రాలిపోతాయి. ఇవి ఆకులను తినడం వలన కిరణజన్య సంయోగక్రియకు భంగం కలుగుతుంది. ఫలితంగా పంట పెరుగుదల మరియు ఉత్పత్తి ప్రతికూలంగా ప్రభావితమవుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ చిన్న తెగులుకు జీవ నియంత్రణ లేదు. అవసరమైతే, వాటిని చేతితో భౌతికంగా తొలగించండి.

రసాయన నియంత్రణ

ఎదుగుదల ప్రారంభ దశలో గొంగళి పురుగులు అధికంగా ఉంటే నష్టం జరగకుండా ముందుగానే చర్యలు తీసుకోవడం అవసరం కావచ్చు. మీరు పంట నష్టం యొక్క సంకేతాలను చూసిన వెంటనే వేగంగా చర్య తీసుకోవాలి. విదేశాలకు విక్రయించడానికి బెండ పండించే పెద్ద పరిమాణపు పొలాల్లో ప్రారంభ దశలో అధిక సంఖ్యలో గొంగళి పురుగులు ఉంటే అవి ఆర్థికపరమైన నష్టాన్ని కలిగిస్తాయి. ఏ ఉత్పత్తులను ఉపయోగించాలో సలహా కోసం మీరు వ్యవసాయ నిపుణుడిని సంప్రదించండి మరియు పురుగుమందులను ఉపయోగించేటప్పుడు నిబంధనలను ఖచ్చితంగా పాటించండి.

దీనికి కారణమేమిటి?

క్సన్తోడెస్ ట్రాన్స్వెర్సా అనే చిమ్మట వల్ల నష్టం జరుగుతుంది. ఇది ఆర్థికంగా ముఖ్యమైన ఇది అనేక రకాల పంటలను తింటుంది, వీటిలో ఎక్కువ భాగం మాల్వేసీ కుటుంబానికి చెందిన మొక్కలు. ఆడ చిమ్మటలు గుడ్లను ఆకుల దిగువ భాగంలో ఒక్కొక్కటిగా పెడతాయి. ఒక వారం తర్వాత గుడ్ల నుండి చిన్న గొంగళి పురుగులు బయటకు వస్తాయి. పూర్తిగా పెరిగిన గొంగళి పురుగు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది, శరీరం పొడవునా ప్రత్యేకమైన పసుపు చారతో ఉంటుంది మరియు పసుపు చారకు రెండు వైపులా గుర్రపుడెక్క ఆకారంలో నలుపు రంగు గుర్తులు ఉంటాయి. గొంగళి పురుగు యొక్క తరువాతి దశలు కొంత భిన్నమైన రంగు నమూనాలను కలిగి ఉంటాయి. చిన్న లార్వా ఒక నూలుపోగు లాగా ఉంటుంది. మరియు చాలా ఎక్కువగా తిరుగుతాయి. ఇవి ఆకుల దిగువ భాగంలో తింటాయి. అందువలన ఇవి ఆకు క్రిందిభాగంలో ఎక్కువగా కనిపిస్తాయి. గొంగళి పురుగులు మట్టిలో ప్యూపా దశకు చేరుకుంటాయి మరియు రెండు వారాల తర్వాత చిమ్మట బైటకి వస్తుంది. పెద్ద చిమ్మటలు పసుపు రంగులో ఉంటాయి, ముందు రెక్క అంతటా మూడు గోధుమ రంగు బాణం-ఆకారపు గీతలు ఉంటాయి. వేడి మరియు తేమతో కూడిన వాతావరణం ఈ తెగులుకు అనుకూలంగా ఉంటుంది. ఇది పెద్దగా నష్టం కలిగించనప్పటికీ, ఇది పంటకు ఎంతో కొంత నష్టం కలిగిస్తుంది.


నివారణా చర్యలు

  • గొంగళి పురుగులను గుర్తించి చేతి తొడుగులు ఉపయోగించి తొలగించండి.
  • ఇవి సులభంగా గుర్తించగలిగే రూపం కలిగి ఉంటాయి.
  • మీ పొలంలో కలుపు మొక్కలను తొలగించండి, ఎందుకంటే గొంగళి పురుగులు వాటిలో దాక్కుని మనుగడ సాగించవచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి