కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

టస్సాక్ చిమ్మట

Lymantriinae

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఇవి ఆకులను తినడం వలన నష్టం కలుగుతుంది.
  • వీటి ముట్టడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు రాలిపోతాయి.
  • ఈ కీటకాల యొక్క గొంగళి పురుగుల వల్ల నష్టం జరుగుతుంది. నివారణ.

లో కూడా చూడవచ్చు

12 పంటలు

కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

లక్షణాలు

గొంగళి పురుగులు ఆకులను నమలడం వల్ల మొక్కలకు కత్తిరించిన రూపాన్ని ఇస్తుంది. ఇవి అనేక రకాల పంటలు మరియు చెట్లను తింటాయి. పొలంలో అధిక సంఖ్యలో లార్వా ఉన్నట్లయితే ఆకులు రాలిపోతాయి వీటి లార్వా లేత పండ్లను కొద్దిగా కొరికి తింటాయి. దీని వలన పండు రంగు మారడం మరియు చర్మం గరుకుగా మారడం జరుగుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

టస్సాక్ చిమ్మటలను వదిలించుకోవడానికి, ప్రత్యేకించి అవి ఇంకా చిన్న వయస్సులో ఉన్నప్పుడు, బాసిల్లస్ తురింజియెన్సిస్‌ను ఉపయోగించవచ్చు. పిచికారీ చేసిన ఆకులను తినే గొంగళి పురుగులను మాత్రమే బాసిల్లస్ తురింజియెన్సిస్‌ చంపుతుంది మరియు పిచికారీ చేసిన తర్వాత దాని తక్కువ జీవితకాలం కారణంగా 7 నుండి 10 రోజుల తర్వాత రెండవసారి పిచికారీ చేయడం సిఫార్సు చేయబడింది. స్పినోసాడ్ కూడా ప్రభావవంతంగా ఉంటుంది కానీ తేనెటీగలు మరియు సహజ శత్రువులకు ఇది హాని కలిగిస్తుంది. ఎండిన తర్వాత చాలా గంటల వరకూ కూడా ఇది తేనెటీగలకు విషపూరితం. పుష్పించే మొక్కలపై స్పినోసాడ్ వాడకూడదు.

రసాయన నియంత్రణ

సాధారణంగా టస్సాక్ చిమ్మట ముట్టడిని వీటి సహజ శత్రువులు నియంత్రిస్తాయి. కాబట్టి మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు ఈ తెగులు సోకినట్లైతే లేదా మొక్కల ఎదుగుదలలో ఏవైనా సమస్యలు ఉంటే తప్ప సాధారణంగా పురుగుమందుల వాడకం అవసరం లేదు. ఆకులు భారీగా రాలిపోయినట్లైతే రసాయన నియంత్రణ మాత్రమే పరిష్కారం కావచ్చు. వీటి నియంత్రణకు మీ ప్రాంతంలో ఏ రకమైన పురుగుమందులు అనుమతించబడతాయో తెలుసుకోవడం ముఖ్యం. టస్సాక్ చిమ్మటలను నియంత్రించడానికి వాడే పురుగు మందు డబ్బాపై పేర్కొనబడిన కొన్ని క్రియాశీల పదార్ధాలలో క్లోరంట్రానిలిప్రోల్, మెథాక్సిఫెనోజైడ్ మరియు ఫాస్మెట్ ఉన్నాయి. ఇతర జాతుల గొంగళి పురుగు సమస్యలను నియంత్రించడానికి ఉపయోగించే పిచికారీలతో కూడా టస్సాక్ చిమ్మటలను నియంత్రించవచ్చు.

దీనికి కారణమేమిటి?

టస్సాక్ చిమ్మటలు, ప్రధానంగా ఓర్గియా, డాసిచిరా మరియు యూప్రోక్టిస్ జాతి చిమ్మటలు ప్రపంచవ్యాప్తంగా మొక్కలకు నష్టం కలిగిస్తాయి. పెద్ద చిమ్మటలు శరీరమంతా వెంట్రుకలు కలిగి ఉంటాయి మరియు గోధుమ, బూడిద లేదా తెలుపు రంగులో ఉంటాయి. టస్సాక్ చిమ్మట దాని జీవిత చక్రంలో అనేక దశలను కలిగి ఉంటుంది. శరదృతువులో చిమ్మటలు పెద్ద సంఖ్యలో గుడ్లను పెడతాయి మరియు తరువాతి వసంతకాలం వరకు గుడ్లు నిద్రావస్థలో ఉంటాయి. వాతావరణం వేడెక్కినప్పుడు, గుడ్లు పొడగబడి పిల్ల గొంగళి పురుగులు బయటకు వస్తాయి. ఇవి పంటలు, చెట్లు మరియు పొదల ఆకులను తినడం ప్రారంభిస్తాయి. అవి ఎదిగేటపుడు వాటి వెంట్రుకలను రాలుస్తాయి. అవి పెరిగేకొద్దీ, అవి టస్సాక్ చిమ్మటకు దాని పేరును ఇచ్చే ఒక విలక్షణమైన వెంట్రుకలను అభివృద్ధి చేస్తాయి. ఆలా కొన్ని వారాలు తిన్న తర్వాత గొంగళి పురుగులు గూడును ఏర్పరుస్తాయి. ఈ గూడులో గొంగళి పురుగు పెద్ద చిమ్మటగా మారుతుంది. ఈ పెద్ద చిమ్మట గూడు నుండి బైటకి వచ్చి ఆడ చిమ్మటతో సంభోగిస్తుంది. ఆడ చిమ్మట గుడ్లు పెట్టి తిరిగి కొత్త చక్రాన్ని ప్రారంభిస్తుంది. ఆడ చిమ్మట ఎగరలేకపోవటం వలన ఒకే ప్రాంతాలలో చిమ్మటల జనాభా పెరుగుతుంది.


నివారణా చర్యలు

  • టస్సాక్ చిమ్మటలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ గొంగళి పురుగులు మానవ చర్మాన్ని చికాకు పెట్టగల మరియు తాకినప్పుడు సులభంగా రాలిపడే వెంట్రుకలను కలిగి ఉంటాయి.
  • రక్షిత దుస్తులను ధరించండి మరియు గొంగళి పురుగు వెంట్రుకలను పీల్చకుండా జాగ్రత్త వహించండి.
  • పొలంలో గుడ్ల సమూహాలు మరియు చిన్న గొంగళి పురుగులు ఉన్నాయేమో గమనించండి మరియు వాటిని తొలగించండి.
  • తెగులు కోసం పొలాన్ని పర్యవేక్షించడమనేది ఎల్లప్పుడూ ఉత్తమ విధానం.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి