కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

స్పిటిల్ బగ్స్

Cercopidae

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • కాండంపై తెల్లటి నురుగు లాంటి పదార్థం.

లో కూడా చూడవచ్చు


కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

లక్షణాలు

వసంత ఋతువు మరియు వేసవి ప్రారంభంలో, తెల్లని నురుగు పదార్థం లేత కాండం మరియు మొక్కల ఆకులపై వృద్ధి చెందుతుంది. ప్రతి తెల్లని ద్రవ్యరాశిలో 4-6 మి.మీ పరిమాణంలో చిన్న చిన్న మరియు ఇంకా పూర్తిగా వృద్ధి చెందని తెలుపు-క్రీము రంగు పురుగు ఉంటుంది. సాధారణంగా దీనివలన మొక్కల ఎదుగుదల ప్రభావితం కాదు, కానీ, ఇవి చిగుర్లను తింటే ఇది మొక్కలలో పెరుగుదలకి సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ చిన్న తెగులుకు జీవ నియంత్రణ లేదు. అవసరమైతే, వీటిని చేతులతో భౌతికంగా తొలగించండి.

రసాయన నియంత్రణ

ఫ్రాగ్‌హాపర్‌లు మరియు స్పిటిల్‌బగ్‌లను నియంత్రించడానికి పురుగుమందులు అవసరం లేదు. స్పిటిల్‌బగ్‌లపై పురుగుమందులు ప్రభావవంతంగా పని చేయవు. ఎందుకంటే నురుగు పదార్థం ద్వారా పిల్ల పురుగులు రక్షించబడతాయి మరియు పురుగు మందుల పిచికారీకి ఇవి ప్రభావితం కావు.

దీనికి కారణమేమిటి?

మొక్కల రసాలను పీల్చే స్పిటిల్ బగ్స్ వల్ల నష్టం కలుగుతుంది. సాధారణంగా ఇవి ఎక్కువ నష్టాన్ని కలిగించవు, కానీ వీటి సంఖ్య పెరిగితే ఇవి సమస్యగా మారవచ్చు. వేటాడే కీటకాలనుండి రక్షించచుకోవడానికి ఇవి నురుగు పదార్థాన్ని సృష్టిస్తాయి. స్పిటిల్ బగ్స్ వాటి జీవిత చక్రంలో మూడు భాగాలను కలిగి ఉంటాయి: గుడ్డు, అపరిపక్వ దశ, పూర్తిగా ఎదిగిన దశ. ప్రతి దశ ఆరు నెలల కాలం వరకు ఉంటుంది. గుడ్లు పొదగబడిన తర్వాత గుడ్ల నుండి వచ్చిన చిన్న కీటకాలు మొక్కను తింటాయి. తరువాతి దశలో, అవి తమను తాము రక్షించుకోవడానికి నురుగును ఉత్పత్తి చేస్తాయి మరియు అవి పెద్దవి అయ్యేవరకు పెరుగుతూనే ఉంటారు. ఇవి వృద్ధి చెందడానికి, అపరిపక్వ దశ సమయంలో మొక్కపై తిరుగుతూ 1-3 నెలల పాటు వివిధ భాగాలను తింటుంది. ఎదిగిన స్పిటిల్‌బగ్‌లు సాధారణంగా మొక్కల శిధిలాలలో లేదా ఆకులు మరియు కాండంలో గుడ్లు పెడతాయి. ఒక్కో ఆడ స్పిటిల్ బగ్ దాదాపు 100-200 గుడ్లు పెడుతుంది. అవి మొక్కలపై గుడ్లలాగా నిద్రావస్థలో ఉంటాయి. సాధారణంగా అపరిపక్వ దశ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇవి పెద్దవిగా వృద్ధి చెందకముందే, శరీరం ముదురు రంగులోకి మారుతుంది. మరియు రెక్కలు వృద్ధి చెందుతాయి. స్పిటిల్‌బగ్స్ చిక్కుళ్ళు మరియు ఇతర నత్రజని-ఫిక్సింగ్ మొక్కలను తినడానికి ఇష్టపడతాయి.


నివారణా చర్యలు

  • స్పిటిల్‌బగ్‌లను వదిలించుకోవడానికి, నురుగును కడగడానికి మరియు మొక్క నుండి వీటిని తొలగించడానికి ఎక్కువ ఒత్తిడితో నీటిని ఉపయోగించవచ్చు.
  • నిద్రావస్థలో ఉన్న గుడ్లను తగ్గించడానికి పంట కాలం ముగిసిన తర్వాత మీ పొలాన్ని శుభ్రం చేయండి.
  • వసంత ఋతువులో, కలుపు మొక్కలపై స్పిటిల్‌బగ్‌లు ఉన్నాయా అని తనిఖీ చేయండి మరియు మీ పంటలకు వ్యాపించే లోపే వీటిని వదిలించుకోండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి