కాప్సికమ్ మరియు మిరప

బ్లాసమ్ ఎండ్ రాట్

Calcium Deficiency Rot

లోపం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకుపచ్చ పండ్ల అడుగున గోధుమరంగు లేక బూడిదరంగు మరకలు కనిపిస్తాయి.
  • పండ్లలోపల నల్లగా కుళ్లిపోతుంది.

లో కూడా చూడవచ్చు


కాప్సికమ్ మరియు మిరప

లక్షణాలు

పుష్పాల చివర తెగులు వలన పండు పై భాగము ఒక క్రమబద్ధము కాని మచ్చ ఏర్పడుతుంది. ఈ మచ్చ రంగు మరియు ఆకారంలో తేడా వుంటుంది. ప్రాధమిక దశలో ఇది లేత ఆకుపచ్చ రంగులో వుంటుంది. పండు పండిన తరువాత అది గోధుమరంగు మరియు నలుపుగా మారుతుంది. పండ్లలో టిష్యూస్ స్థిరత్వాన్ని కోల్పోయి నొక్కుకుపోయి చివరకు పైభాగం చదునుగా అయిపోతుంది. పైకి ఏ విధమైన లక్షణాలు కనపడకపోయినా పండ్ల లోపల మాత్రం ఈ నల్లటి కుళ్ళు అభివృద్ధి చెందుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

కాల్షియం ఎక్కువగా కలిగిన పదార్థములు కలిగిన సున్నపురాయి, బసాల్ట్ పిండి, కాల్చిన సున్నము, డోలమైట్, జిప్సం మరియు సున్నపు రాయి పొలంలో వేయండి .

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. అత్యవసర చర్యగా ఆకులపైన కాల్షియం క్లోరైడ్ ను స్ప్రే చేయండి కానీ ఎక్కువ సార్లు మరియు ఎక్కువ మోతాదులో పిచికారీ చేయకండి.

దీనికి కారణమేమిటి?

బ్లాసమ్ ఎండ్ రాట్ అనేది పండ్ల కణజాలంలో కాల్షియం లోపం వలన కలిగే ఒక శరీర సంబంధ రుగ్మత. ఎటువంటి చీడ లేదా తెగులు దీనికి కారణం కాదు. కణజాలాల బలానికి మరియు గట్టిదనానికి కాల్షియం పనిచేస్తుంది. నేలలో ఈ పోషకము అందుబాటులో లేనందువలన లేదా కాల్షియంను మొక్క పీల్చుకొని దాని అన్ని భాగాలకు పంపిణీ చేయలేకపోవడం వలన కాల్షియం లోపం కలగవచ్చు. దీనివలన కణజాలం యొక్క నిర్మాణము నాశనం అవుతుంది. కాల్షియం లోపం వలన నల్లని నొక్కుకుపోయినట్టు వుండే అస్తవ్యస్త వేరు నష్టం కలుగుతుంది.


నివారణా చర్యలు

  • నేల యొక్క పిహెచ్ స్థాయిను సర్దుబాటు చేయండి, ఉదాహరణకు సున్నం వేయడం.
  • నేలలో తేమ వుండే విధంగా ఆకులను మట్టిపై కప్పండి.
  • లోతు వ్యవసాయ పద్దతుల వలన వేర్లు దెబ్బతినకుండా జాగ్రత్త పడండి.
  • నత్రజని తక్కువగా మరియు కాల్షియం అధికంగా వుండే విధంగా ఎరువులను వేయండి.
  • పొడిగా వుండే కాలంలో క్రమబద్ధమైన నీటి పారుదల వుండే విధంగా చూసుకొండి.
  • అధికంగా నీరు పెట్టవద్దు మరియు ఒక మంచి డ్రైనేజ్ వ్యవస్థను సమకూర్చుకొంది.
  • నైట్రేట్ ను అమ్మోనియా రూపంలో కాకుండా నత్రజని రూపములో వాడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి