టమాటో

మాంగనీస్ లోపం

Manganese Deficiency

లోపం

5 mins to read

క్లుప్తంగా

  • లేత ఆకులపై పాలిపోయిన ఆకుపచ్చ నుండి పసుపు రంగు విస్తరించినట్టు మచ్చలు కనపడతాయి.
  • ఈ రంగుపోయిన ఆకులపైన చిన్న నిర్జీవమైన మచ్చలు ఏర్పడతాయి.
  • ఈ లోపాన్ని సవరించకపోతే గోధుమరంగు నిర్జీవమైన మచ్చలు ఆకు ఉపరితలంపై కనిపిస్తాయి.
  • దీనివలన తీవ్రంగా ప్రభావితమైన ఆకులు గోధుమ రంగు లోకి మారి వాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు

57 పంటలు
బాదం
ఆపిల్
అప్రికోట్
అరటి
మరిన్ని

టమాటో

లక్షణాలు

ఈ లోపం వలన ఏర్పడే లక్షణాలు ఇతర పోషక లోపాల కంటే తక్కువ నాటకీయంగా ఉంటాయి మరియు వేసిన పంట మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. మెగ్నీషియం లోపం వున్న మొక్కలలో మధ్యన మరియు పైన వున్న ఆకులు పచ్చగానే ఉంటాయి లేత ఆకుల మీద ఈనెల క్లోరోసిస్ వలన పాలిపోయిన ఆకుపచ్చ నుండి పసుపు రంగు మచ్చలు పచ్చని ఈనేలతో వేరు చేసి ఉంటాయి. కాలక్రమేణా చిన్న నిర్జీవమైన మచ్చలు కోరోటిక్ కణజాలంపై అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా అంచులు మరియు కొనల (టిప్ బర్న్) వద్ద ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. ఆకు పరిమాణం తగ్గుతుంది, ఆకు రూపం మారి ఆకు అంచులు గింగిర్లు తిరుగుతాయి. ఈ లోపాన్ని సరిదిద్దకపోతే, గోధుమరంగు నిర్జీవమైన మచ్చలు మరింత పెరుగుతాయి. మరియు కొంతకాలానికి పతనం చెంది కన్నాలు ఏర్పడి గరుగ్గా తయారవుతాయి. తీవ్రంగా దెబ్బతిన్న ఆకులు గోధుమరంగు లోకి మారి వాలిపోతాయి. మెగ్నీషియం లోపం వున్న కూడా ఇలాంటి లక్షణాలే కనపడతాయి కానీ ఈ మెగ్నీషియం లోపం ముదురు ఆకులలో కనిపిస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

పోషక పదార్థం మరియు నేలల pH సమతుల్యం చేయడానికి పేడ, సేంద్రీయ పదార్ధాలను మట్టిపై కప్పడం లేదా కంపోస్టును వాడండి. వీటిలో పదార్ధాలను కుళ్ళేటట్టు చేసే హ్యూమస్ ఉంటుంది. ఇది నీటిని నిలుపుకొని ఉండే సామర్ధ్యాన్ని పెంచుతుంది మరియు pH ను కొద్దిగా తగ్గిస్తుంది.

రసాయన నియంత్రణ

  • మాంగనీస్ (Mn) కలిగిన ఎరువులను వాడండి.
  • ఉదాహరణ: మాంగనీస్ సల్ఫేట్ (Mn 30.5%) సాధారణంగా నేల మరియు ఆకులపై పిచికారీగా ఉపయోగిస్తారు.
  • మీ నేల మరియు పంటకు తగిన ఉత్పత్తి మరియు మోతాదును తెలుసుకోవడానికి మీ వ్యవసాయ సలహాదారుని సంప్రదించండి.

మరిన్ని సిఫార్సులు:-

  • పంట దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి పంట సీజన్ ప్రారంభానికి ముందు మట్టి పరీక్ష సిఫార్సు చేయబడింది.

దీనికి కారణమేమిటి?

మాంగనీస్ (Mn) లోపం అనేది ఒక విస్తృతమైన సమస్య, ఇసుక నేలలు, pH 6 కన్నా అధికంగా ఉన్న సేంద్రీయ నేలలతో మరియు ఉష్ణమండల నేలల్లో సంభవిస్తాయి. దీనికి విరుద్ధంగా అధిక ఆమ్ల నేలలు ఈ పోషకం లభ్యతను పెంచుతాయి. ఎరువులు ఎక్కువగా ఉపయోగించడం వలన కొన్ని సూక్ష్మపోషకాలు ఒక దానితో ఒకటి పోటీ పడి మొక్కకు సరిగా అందకపోవచ్చు. కిరణజన్య సంయోగక్రియ మరియు నైట్రేట్ ను గ్రహించడంలో మాంగనీస్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇనుము, బోరాన్, కాల్షియం లాగానే మాంగనీస్ కూడా మొక్కలోపల స్థిరంగా కదలకుండా ఉంటుంది. ఇది ఎక్కువగా క్రింది ఆకులలో పేరుకుపోతుంది. అందు వల్లనే ఈ లోపం యొక్క లక్షణాలు ముందుగా లేత ఆకులలో కనిపిస్తాయి . కొన్ని మిరప మొక్కలలో మాంగనీస్ లోపాన్ని అధికంగా కనపరుస్తాయి మరియు ఈ పోషక పదార్ధం వున్న ఎరువులను వాడడం వలన ఆవి అనుకూల స్పందనను కనపరుస్తాయి. తృణధాన్యాలు, చిక్కుళ్ళు, స్టోన్ ఫ్రూట్, పామాయిల్ పంటలు, నిమ్మ జాతి మొక్కలు,ఆవ లాంటి మొక్కలలో ఇది గమనించవచ్చు.


నివారణా చర్యలు

  • మొక్కలు పోషకాలను బాగా గ్రహించడం కోసం మట్టిలో pH స్థాయిని సరిచేయండి.
  • పొలాలలో మంచి నీటిపారుదల వ్యవస్థను అమర్చుకోండి.
  • పంటకు ఎక్కువ నీటిని పెట్టకండి.
  • మట్టిలోని తేమను స్థిరంగా ఉంచడానికి సేంద్రీయ పదార్ధాలను మట్టిపైన కప్పండి.
  • సమతుల ఎరువులను వాడడం వల్లనే మొక్క ఆరోగ్యంగా పెరుగుతాయి అని దాని వలన అధిక దిగుబడి వస్తుంది అని గ్రహించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి