ప్రత్తి

ఫెర్టిలైజర్ బర్న్

Fertilizer Burn

ఇతర

5 mins to read

క్లుప్తంగా

  • ఆకు అంచులు గోధుమరంగులోకి మారడం లేదా ఆకులు మాడిపోవడం జరుగుతుంది.
  • ఆకులు వాలిపోతాయి మరియు పసుపు రంగులోకి మారతాయి.
  • ఎదుగుదల మందగించడం జరుగుతుంది.

లో కూడా చూడవచ్చు


ప్రత్తి

లక్షణాలు

అధికంగా ఎరువులను వాడడం వలన జరిగిన నష్టం ఆకు కొనలు గోధుమరంగులోకి మారడం లేదా ఆకు మాడిపోవడంగా కనపడుతుంది. రసాయన ఎరువుల నుండి వచ్చే, కరిగే లవణాలు వేరు కణజాలం నుండి తేమను తీసివేయడం వలన వాలిపోవడం ఆకు కొనలు గోధుమరంగులోనికి మారడం మరియు పెరుగుదల మందగించడం జరుగుతుంది. ఆకు మాడిపోవడం లేదా ఎండిపోవడం అనేది కొన్ని ఎరువులు నేరుగా ఆకుకు తాకడం కారణంగా కూడా జరగవచ్చు. గుళికలు చల్లడం ద్వారా లేదా ద్రవాలను పిచికారీ చేయడం ద్వారా కూడా ఈ సమస్య రావచ్చు. నేల రకం, వ్యవసాయ పద్ధతులు, ఉప్పు స్థాయిలు మరియు మొక్కల సున్నితత్వం వంటి అంశాలు నష్టం యొక్క పరిమాణాన్ని ప్రభావితం చేస్తాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఫర్టిలైజర్ బర్న్ కు ఎటువంటి జీవ నియంత్రణ ఎంపికలు అందుబాటులో లేవు,

రసాయన నియంత్రణ

ఫెర్టిలైజర్ బర్న్ ను నియంత్రించడానికి ఎటువంటి రసాయన నియంత్రణ పద్ధతులు అందుబాటులో లేవు.

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలకు కారణం అధిక ఎరువుల వాడకం. నేల రకం, నీటిపారుదల పద్ధతులు, ఉప్పు స్థాయిలు మరియు నిర్దిష్ట మొక్కల సున్నితత్వం వంటి అంశాలు నష్టం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. ఎరువులు అధికంగా వాడకం వలన వేడి పొడి వాతావరణంలో కూరగాయ మొక్కలకు కలిగే నష్టం మరింత ఎక్కువగా వుంటుంది. కరువు పరిస్థితులల్లో ఎరువులలోని లవణాలు నేలలో ఎక్కువ సాంద్రతతో వుంటాయి. ఇది వేరుకు సూటిగా నష్టం కలిగించి మొక్క పై భాగంలో వుండే ఆకు మాడిపోవడం రూపంలో కనబడుతుంది. ఇంకా, కరిగే లవణాలు మొక్క వెంబడి నీటి కదలికను అనుసరించవచ్చు మరియు వేడి పొడి రోజులలో ఆవిరవ్వడం ద్వారా తేమను త్వరగా కోల్పోయే ఆకులలో ఇవి కేంద్రీకృతమవుతాయి. చల్లటి, మేఘావృతమైన వాతావరణంలో, తగినంత తేమ మట్టిలో ఉన్నప్పుడు, ఆకుల నుండి తేమ నష్టం తక్కువగా ఉంటుంది, ఇది చాలా మొక్కలు వసంత కాలంలో అధిక లవణ స్థాయిలను తట్టుకునేలా చేస్తాయి, కానీ వేసవి కాలంలో ఇలా జరగదు.


నివారణా చర్యలు

  • నెమ్మదిగా విడుదల చేయు సేంద్రియ ఎరువుల ద్వారా ఈ సమస్యను నిరోధించవచ్చు.
  • ప్రతి సంవత్సరం నేలపై కొన్ని సెంటిమీటర్ల వరకు సేంద్రియ ఎరువును వేయడం వలన కూడా ఉపయోగం ఉంటుంది.
  • ఎరువులు వేసిన తర్వాత ఆకులపై వున్న ఎరువుల గుళికలను తుడిచివేయండి.
  • ఆకులపై పిచికారీ చేయడానికి, నీటిలో కరిగే ఎరువులను లేబిల్ పై వున్న సూచనల ప్రకారం వాడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి