గోధుమ

కంకి కోకిల్ ఈల్ వార్మ్

Anguina tritici

ఇతర

5 mins to read

క్లుప్తంగా

  • పాలిపోయిన పచ్చని, వంకర్లు పోయిన ఆకులు మరియు ఎదుగుదల మందగించిన మొక్కలు ఈ తెగులు లక్షణాలు.
  • గోధుమల చుట్టూ వుండే పొట్టు అసాధారణ కోణంలో బైటకి వస్తాయి.
  • కంకులలో గోధుమ కంకులలో రూపం కోల్పోయిన గింజలు ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

గోధుమ

లక్షణాలు

కొన్ని సందర్భాలలో ఈ A. ట్రిటికి సోకిన మొక్కలు ఎటువంటి సృష్టమైన లక్షణాలను బహిర్గతపరచవు. ఆకులు కొద్దిగా వంకర్లు తిరుగుతాయి. ఆకుల పైభాగంలో ఉబ్బెత్తుగా వున్న పట్టీలు మరియు ఆకుల క్రింది భాగంలో గుంతలు పడతాయి. ముడుతలు పడడం, చుట్టుకుపోవడం మరియు మధ్య ఈనె వైపు ఆకులు అంచులు మెలికెలు తిరగడం ఈ తెగులు ఇతర లక్షణాలు. మొక్కలు పాలిపోవడం లేదా పత్రహరితం కోల్పోవడం, మొక్కలలో ఎదుగుదల మందగించడం, గోధుమల చుట్టూ వుండే పొట్టు అసాధారణ కోణంలో బైటకి రావడం జరుగుతుంది. కంకులలో గోధుమ కంకులలో రూపం కోల్పోయిన గింజలు ఏర్పడతాయి. రై కంకులలో ఈ లక్షణాలు కనపడవు. వీటిలో కొన్ని విత్తనాలు ఎండిపోయిన నెమటోడ్లు కలిగిన పొక్కులుగా (గాల్స్) మారతాయి. ఈ పొక్కులు (గాల్స్) పొట్టిగా, లావుగా మరియు ఆరోగ్యమైన గింజలతో పోలిస్తే తేలికగా ఉంటాయి మరియు ఇవి పెద్దవిఅయ్యే లోపు లేత గోధుమ రంగు నుండి నల్లని రంగు లోకి మారతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

విత్తనాలను సాధారణ ఉప్పు ద్రావణంలో (5 లీటర్ల నీటిలో ఒక కిలో ఉప్పు)ముంచి బాగా అధిక వేగంతో కదపడం చేయవచ్చు. ఇలా చేసినప్పుడు తెగులు సోకిన విత్తనాలు మరియు చెత్త పైభాగానికి చేరుకుంటాయి. దీనిని సేకరించి ఆవిరి పట్టడం, ఉడక పెట్టడం లేదా రసాయనాలతో చికిత్స చేయడం ద్వారా ఈ నెమటోడ్లను చంపవచ్చు. క్రిందకి చేరిన ఆరోగ్యంగా వున్న విత్తనాలను శుభ్రమైన నీటితో అనేక సార్లు బాగా శుభ్రం చేసి ఎండబెట్టి నాటడానికి ఉపయోగించవచ్చు. 54-56°C వద్ద 10-12 నిముషాలు విత్తనాలను వేడినీటిలో నానబెట్టడం ద్వారా కూడా ఈ నెమటోడ్లను చంపవచ్చు. ఈ గాల్స్ విత్తనాల కన్నా చిన్నగా ఉండడం వలన, చివరగా యంత్రాల ద్వారా జల్లెడ పట్టడం ద్వారా గాల్స్ ను విడదీయవచు. A. ట్రిటికి ను నియంత్రించడానికి విత్తనాలను శుభ్రం చేయడం కన్నా అధిక ప్రభావం ఈ నెమటిసిడాల్స్ మొక్కలు చూపించవు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులును ఎటువంటి రసాయనాలు సిఫార్స్ చేయబడలేదు. విత్తనాలను శుభ్రపరచడం ద్వారా మరియు విత్తనాల ధ్రువీకరణ కార్యక్రమం ద్వారా, వేడి నీటి చికిత్స లేదా గురుత్వాకర్షక టేబుల్ విత్తన ప్రక్రియ ద్వారా వీటిని నిర్మూలించవచ్చు.

దీనికి కారణమేమిటి?

అంగుయ్న ట్రిటికి నెమటోడ్ వలన ఈ లక్షణాలు రాడతాయి. చిన్న నెమటోడ్లు నీటి పొరల ద్వారా మొక్కలపైకి చేరతాయి. ఇవి తొడిమను చీల్చి పుష్ప గుచ్చంలోకి ప్రవేశిస్తాయి. గోధుమ, బార్లీ, మరియు రై దీనికి ప్రధాన అతిధులు. ఓట్, మొక్కజొన్న మరియు జొన్న పంటలను ఇవి ఆశించవు. పక్వానికి వస్తున్న గింజలలోకి ఇవి చేరిన తర్వాత ఇవి గాల్స్ ఏర్పడడాన్ని ఉదృత పరుస్తాయి. వీటిలో ఇవి నివాసం ఏర్పరచుకుని చివరకు పెద్ద నెమటోడ్లుగా మారతాయి. ఇవి సంయోగం చెందిన తర్వాత ఆడ నెమటోడ్లు గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు విత్తనాలలో ఏర్పడిన పొక్కులలోనే (గాల్స్) లోనే పొదగబడతాయి. తరువాత ఈ గుడ్లు తేమను కోల్పోయి తరువాత వసంత ఋతువు వచ్చేవరకు నిద్రావస్థలో ఉంటాయి. మొక్కలు వేసేటప్పుడు మరియు పంట కోతల సమయంలో విత్తనాలతో పాటు ఈ గాల్స్ కూడా వెదజల్లబడతాయి. తేమగా వున్న మట్టి మరియు నీరు ఈ నెమటోడ్లకు తగిలినప్పుడు వాటి జీవిత చక్రాన్ని మరల తిరిగి ప్రారంభిస్తాయి. చల్లని తేమ వాతావరణం వీటి ఎదుగుదలకు అనుకూలంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • అత్యుత్తమ నాణ్యత కలిగిన ధ్రువీకరించబడిన విత్తనాలనే ఉపయోగించండి.
  • తెగులు నిరోధకత కలిగిన విత్తనాలను వాడండి.
  • (మార్కెట్లో అనేక రకాలు అందుబాటులో వున్నాయి) వీలైతే కనీసం ఒక సంవత్సరం వరకు పొలాన్ని బీడుగా ఉంచండి.
  • ఈ తెగులు తరువాత సీజన్లోని పంటలకు సంక్రమించకుండా ఉండడానికి ఈ తెగులును ఆతిధ్యం ఇవ్వని పంటలతో కనీసం ఒక సంవత్సరం పంట మార్పిడికి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి