వరి

పచ్చ కొమ్ముల గొంగళి పురుగులు

Melanitis leda

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఈ లార్వా ఆకు కొనలను మరియు అంచులను రాత్రి పూట ఆహారంగా తింటుంది.
  • సాధారణంగా ఆకు ప్రధాన ఈనె వెంబడి ఆకు కణజాలం యొక్క చాలా ప్రాంత తినివేయబడి వుంటుంది.
  • రెండు కొమ్ములు గల ఈ ఆకుపచ్చ గొంగళి పురుగులు ఆకులపై కనిపిస్తాయి.

లో కూడా చూడవచ్చు

10 పంటలు
చిక్కుడు
కాకరకాయ
జామ
మామిడి
మరిన్ని

వరి

లక్షణాలు

ఆకుపచ్చ కొమ్ము గొంగళి పురుగు ఆకుల కింది భాగాన మధ్య ఈనెకు సమాంతరంగా వుండి, ఎక్కువ మటుకు రాత్రిపూట ఆకులను ఆహారంగా తీసుకుంటుంది. ఆకు ఈనె వెంబడి పెద్ద మొత్తంలో ఆకు కణజాలాన్ని ముదిరిన ఈనెతోపాటు తొలుస్తుంది. ఈ నష్టం వరి స్కిప్పర్ మరియు ఆకుపచ్చ సెమీలూపర్ ద్వారా జరిగే నష్టంలాగే వుంటుంది, కనుక ఈ జాతుల మధ్య తేడాను గుర్తించడానికి గొంగళి పురుగును గుర్తించడం చాలా అవసరం. లార్వా తన జీవిత కాలాన్ని పూర్తి చేయడానికి సహాయ పడే మరియు పొలంలో వాటి నిరంతర అభివృద్ధికి తోడ్పడగల ప్రత్యామ్నాయ అతిధేయులను కూడా తింటుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఆకుపచ్చ కొమ్ముల గొంగళిపురుగుల యొక్క సహజ శత్రువులలో చలిసిడ్ కందిరీగలు (ట్రైకోగ్రామా జాతులు) మరియు లార్వాలపై జీవించే పరాన్నజీవులైన రెండు జాతుల టాచినిడ్ ఫ్లైస్ వుంటాయి. వేస్పిడ్ కందిరీగల యొక్క కొన్ని జాతులు లార్వాలను ఆహారంగా తీసుకుంటాయి. ఈ కీటకం సాధారణంగా తక్కువ సంఖ్యలో ఏర్పడడం మరియు లాభదాయక కీటకం నుండి ఒత్తిడి అధికంగా వుండడం కారణంగా, తినడం వలన కలిగే నష్టం నుండి మొక్క త్వరగా కోలుకోగలదు.

రసాయన నియంత్రణ

అందుబాటులో వుంటే, ఎల్లప్పుడూ నివారణా చర్యలు మరియు జీవ సంబంధ చికిత్సలు గల ఒక సమగ్ర విధానాన్ని పరిగణించండి. ప్రత్యేకంగా మెలాంటిస్ లెడా ఇస్మాన్ ను లక్ష్యంగా చేసుకునే రసాయనిక నియంత్రణ చర్యలు లేవు. పెద్ద ఎత్తున వాడే పురుగుమందులు తెగులును చంపవచ్చు, కానీ అదే సమయంలో వాటి యొక్క సహజ శత్రువులను కూడా చంపవచ్చు. దానికి అనుగుణంగా, చాలా తీవ్రమైన వ్యాధి సందర్భాలలో మాత్రమే ఇలాంటి రకాల పురుగుమందులను పిచికారీ చేయమని సిఫారసు చేయబడింది.

దీనికి కారణమేమిటి?

ఆకుల మీద లక్షణాలు సాధారణంగా మెలాంటిస్ లేడా అనే ఆకుపచ్చ కొమ్ముల గొంగళిపురుగుల జాతి గొంగళిపురుగుల వలన ఏర్పడతాయి, అయితే మైకాలెసిస్ జాతులు కూడా పాలుపంచుకొని ఉండవచ్చు. ఈ కీటకాలు అన్ని వరి పర్యావరణాలలో కనిపిస్తాయి మరియు అవి వర్షపాత ప్రాంతాలలో అత్యంత సాధారణం. పెద్ద కీటకాలు పెద్ద బంగారువర్ణ గోధుమ రంగులో, రెక్కల మీద ప్రత్యేకమైన నల్లటి మచ్చలు గల సీతాకోకచిలుకలు. ముఖ్యంగా, అవి కాంతి ఉచ్చులకు ఆకర్షించబడవు. ఆడ కీటకాలు మెరిసే, ముత్యం వంటి గుడ్లను వరి ఆకుల మీద వరుసలలో ఒక్కొక్కటిగా పెడతాయి. లార్వాలు వాటి పసుపు ఆకుపచ్చ రంగు మరియు చిన్నపసుపు రంగు పూసల వంటి వెంట్రుకలతో నిండిపోయిన వాటి శరీరం కారణంగా వరి ఆకులతో సులభంగా కలిసిపోతాయి. వాటి తలపై రెండు గోధుమ రంగు కొమ్ములు వుంటాయి, ఇవే వాటికి ఆ పేరును ఇస్తాయి. అవి పొలంలో వాటి నిరంతర అభివృద్ధికి మద్దతునిచ్చే ప్రత్యామ్నాయ అతిధేయులను ఆహారంగా తీసుకుంటాయి. ప్యూప దశ ఆకులపై సంభవిస్తుంది. ఆకుపచ్చ కొమ్ముల గొంగళిపురుగులు వరి యొక్క చిన్న తెగుళ్లు. వాటి సంభావ్య తీవ్రత సాధారణంగా దిగుబడిని తగ్గించడానికి సరిపోనంత చిన్నది.


నివారణా చర్యలు

  • ఈ తెగులు లక్షణాల కోసం పొలాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • పొలంలోని గుడ్లను, లార్వాను, తెగులు సోకిన మొక్కలను లేదా మొక్క భాగాలను చేతితో తీసివేసి నాశనం చేయండి.
  • కీటకాలను పట్టుకొనుటకు ప్రత్యేక వలలను వుపయోగించి మొక్కలను రక్షించుకోండి.
  • సమతుల్య ఎరువులను, సరైన నీటి పారుదలను మరియు కలుపు మొక్కలను పూర్తిగా తొలగించడం వంటి సరైన పద్దతులను పాటించండి.
  • పొలాల చుట్టూ ప్రత్యమ్నాయ నివాసాలను తొలగించండి.
  • పంటకు ఉపయుక్తంగా వుండే సహజ శత్రువులు నాశనం కాకుండా ఉండే రీతిలో పురుగుల మందులను వాడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి