వరి

వరి ఆకు కీటకం

Oligonychus spp.

పురుగు

5 mins to read

క్లుప్తంగా

  • ఆకు కింది భాగంలో పౌడర్ లాంటి పదార్థం కనిపిస్తుంది.
  • ఆకు పైభాగంలో పసుపు మరియు గోధుమ రంగు మచ్చలు వుంటాయి.
  • ఆకులు బూడిదరంగుకి మారి ఎండిపోతాయి.
  • ఇవి చాల చిన్నగా ఉంటాయి.
  • అందువలన భూతద్ధంతో చూస్తే తప్ప కనిపించవు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

ఆకులపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. చివరికి ఇవి పసుపు లేదా గోధుమ రంగులోకి మారి ఎండిపోతాయి. దీన్ని లీఫ్ స్టిప్లింగ్ అంటారు. తెగులు అధికంగా వున్నప్పుడు ఆకు మొత్తం బూడిద రంగులోకి మారి ఎండిపోతుంది. ఈ కీటకం ఆకు ఈనెల మధ్య దిగువ ఉపరితలంపై చాలా సున్నితమైన గూడును ఏర్పరుస్తుంది, ఇది ఒక పౌడర్ లాగ కనిపిస్తుంది. కీటకం ఆకు పైపొరను చీల్చి రసాన్ని పీల్చేయడం వలన ఆకులలో పత్రహరితం నష్టపోయి, తెగులు సోకిన మొక్కను దూరం నుండి చూస్తే, లేత పసుపురంగులో లేదా పాలిపోయినట్టు కనిపిస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

జీవనియంత్రణ ప్రత్యామ్నాయంగా ఒక కేజీ విత్తనాలకు10 గ్రాములు చొప్పున స్యుడోమోనాస్ రకం బాక్టీరియాతో విత్తనశుద్ధి చేయండి. యూరియా మిశ్రమాన్ని వేప చెక్కతో కలిపి వరిలో వాడడం మంచి ఫలితాలను ఇస్తుంది. లక్షణాలను గుర్తించిన తర్వాత వెట్టబుల్ సల్ఫర్ (3 గ్రా) ను వాడండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మిట్సైడ్స్ కలిగిన స్పిరోమెసిఫెన్ కీటక నాశిని ఓ. ఒరిజి పైన మంచి ప్రభావం చూపిస్తుంది. కానీ తెగులు తీవ్రతను బట్టి దీని ధరను బట్టి కీటకాల సాంద్రతను బట్టి ఈ మందును వాడాలి. సరైన సమయంలో దీనిని వాడడం చాల అవసరం.

దీనికి కారణమేమిటి?

ఒలిగొనికస్ ఒరిజై అనే వరి ఆకు కీటకం తినడం వలన ఈ తెగులు సోకుతుంది. అధిక ఉష్ణోగ్రత (25° C మరియు ఆ పైన) మరియు సంబంధిత వాతావరణ సమయంలో నష్టం అధికంగా వుంటుంది. వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి కీటకం యొక్క మొత్తం జీవిత కాలం 8-18 రోజులు వరకు ఉంటుంది. పెద్ద కీటకాలు గుడ్ల నుండి బయటకు వచ్చిన వెంటనే పరిపక్వం చెంది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సెక్స్ లో పాల్గొంటాయి. గ్రుడ్లను ఒక్కొక్కటిగా ఈనెలు లేదా ప్రధాన ఈనే వెంబడి వరుసగా ఆకు కింది భాగంలో పెట్టి వాతావరణ పరిస్థితులను బట్టి 4-9 రోజులలో పొదుగుతుంది. తడిగా వున్న పొలంలో వుండే కలుపుమొక్కలపై (ఏకైనికోలా కొలోనా) ఇది దాడి చేస్తుంది. ఈ తెగులును అదుపు చేయడం చాలా కష్టం. అందువలన, ముందు పంటకు ఈ తెగులు సోకితే, తర్వాత వేసిన వరి పంటకు కూడా ఈ తెగులు సంక్రమిస్తుంది.


నివారణా చర్యలు

  • లీఫ్ బ్రైట్ లక్షణాల కొరకు పొలాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • వరి గట్లపై కలుపు లేకుండా చూడండి.
  • ఇవి ఆకు ఎండు పురుగుకు ప్రత్యామ్యాయ ఆవాసాలుగా వుంటాయి.
  • పంట మార్పిడి ద్వారా అప్పుడప్పుడు వరి పంట వేయకండి లేదా పొలాన్ని లోతుగా దున్ని వరి పంట అవశేషాలను పూడ్చిపెట్టండి.
  • అధిక నత్రజని ఎరువుల వాడకం తెగులుకు అనుకూలం అవుతుంది, అందువలన అధిక నత్రజని వాడకాన్ని నిరోధించండి.
  • పంట కోత తర్వాత పంట అవశేషాలు మొత్తం పొలంలోనుండి తొలగించండి.
  • పొలాన్ని బాగా లోతుగా దున్నండి.
  • ఈ వ్యాధి సోకని ఇతర పంటలతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి