వరి

క్షారత్వం లేదా చౌడు

Alkalinity

ఇతర

5 mins to read

క్లుప్తంగా

  • తెలుపు నుండి ఎరుపు గోధుమ రంగుతో రంగు కోల్పోయి ఆకు కొన నుండి మొదలై ఆ తరువాత ఆకు మొత్తం వ్యాపిస్తుంది.
  • ఆకులు ఎండిపోయి చుట్టుకుపోతాయి.
  • పిలకలు రావడం మరియు ఎదుగుదల నిరోధించబడుతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

పంట జీవిత కాలంలో ఏ సమయంలో అయినా ఈ క్షార స్వభావం పంటకు నష్టం కలిగించగలదు. ఆకు కొన నుండి మొదలయ్యి ఆకులు పాలిపోయి, తెలుపు నుండి ఎరుపు గోధుమ రంగుకు మారినట్టు కనబడుతాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా వుంటే ఆకు మొత్తం పాలిపోయి ఆకులు తెల్లగా మారి మొక్క వాడిపోయినట్టు కనిపిస్తుంది. ఆకు ముడత చుట్టుకోవడం అనేది దీని ఒక లక్షణం. అధికంగా వుండే చౌడు నేలల్లో పిలకలు వేయడం తగ్గిపోయి మొక్కను క్షీణింపచేస్తుంది. మొక్కలు పూత దశకు చేరేటప్పటికి, ఈ చౌడు పూతను ఆలస్యం చేస్తుంది మరియు పాలిపోవడానికి కారణం అవుతుంది. దీని లక్షణాలు నత్రజని లోపం లక్షణాలు ఒకేవిధంగా ఉండడం వలన గందరగోళంగా ఉంటుంది

Recommendations

సేంద్రీయ నియంత్రణ

సేంద్రియ ఎరువులు, వెంట్రుకల తుక్కు, ఈకలు, సేంద్రియ చెత్త, వేస్ట్ పేపర్, పడేసిన నిమ్మ, లేదా నారింజలను వాడడం ద్వారా చౌడునేలలను సారవంతం చేసుకోగలం. ఇది చౌడు పదార్థాలను నేలల్లో నిర్దారించడం లేదా ఏర్పడకుండా చేస్తుంది. పైరేట్ లేదా తక్కువ ధర అల్యూమినియం సల్ఫేట్ వంటివి మినరల్స్ నేలకు జతపరచడం ద్వారా నేలలో ఆమ్లత్వాన్ని పెంచవచ్చు .

రసాయన నియంత్రణ

సమస్యను బట్టి నేలలో చౌడును వివిధ మార్గాల్లో సవరించవచ్చు. సాధారణంగా తక్కువ సున్నం పదార్థంతో వున్న నేలల్లో అధిక సోడియంను నియంత్రించడానికి జిప్సంను వాడుతారు. మట్టిలోనుండి సోడియం ను తొలగించుటకు అధిక స్థాయిలో నీటిని పెట్టి బయటకు వదలవలెను. జిప్సం లో వుండే నీటిలో కరిగే కాల్షియం సోడియం ఆయాన్లను స్థానభ్రంశం చెందకుండా చేసి అధిక నీటిలో కొట్టుకు పోయే విధంగా చేస్తుంది. జిప్సంకు బదులుగా చాలినంత కాల్షియం కార్బోనేట్ నేలల్లో వాడుతారు. చౌడు నేలలను సారవంతం చేయడానికి యూరియా ఆధారిత కాల్షియం క్లోరైడ్ (CaCl2) లేదా రసాయన ఎరువులు ఉపయోగిస్తారు.

దీనికి కారణమేమిటి?

క్షార స్వభావం (చౌడు) అనేది మట్టిలోని అయాన్ల ఉనికిని సూచిస్తుంది. దీనివలన మట్టిలో pH అధికమౌతుంది. సరైనటువంటి నిర్మాణం లేని నేల మరియు తక్కువ వడపోత సామర్థ్యం వంటివి బంక నేలలు, సోడిక్ లేదా సున్నపు నేలల లక్షణాలు. చౌడు మొక్క వేరును నష్టపరుస్తుంది మరియు మొక్కలు నీటిని గ్రహించడంను బలహీన పరచి నేలలోని పోషకాలను మొక్క సరిగా సంగ్రహించకుండా చేస్తుంది. మొక్క వేరు సరిగ్గాపెరగపోవడం మరియు మొక్క పెరుగుదల మందగిస్తుంది. చౌడు నేలలు మొక్కకు నేలలో వుండే పోషకాలు అందడాన్ని నియంత్రిస్తాయి. దాని వలన మొక్కకు భాస్వరం మరియు జింక్ లోపాలు ఏర్పడుతాయి, మరియు ఇనుము మరియు బోరాన్ టాక్సిసిటీ లోపం కూడా ఏర్పడే అవకాశం వుంది. అధిక pH అనేది పెద్ద సమస్య లాగా పరిగణించబడదు. ఏది ఏమైనా వర్షాధార ప్రాంతాల్లోని తక్కువ వర్షపాతం లేదా సాగునీటి ప్రాంతాల్లో సరైనటువంటి నీటి పారుదల లేకపోవడం మొక్కలను ప్రభావితం చేయగలదు. ఆశ్చర్యం కలిగించని విధంగా ఉప నిర్జల ప్రదేశాలలో దీనిని గమనించవచ్చు మరియు ఇది తరచుగా లవణీయత కలిగి ఉంటుంది.


నివారణా చర్యలు

  • నేలలో వుండే నీరు ఆవిరి కాకుండా నేలపై గడ్డిని పరచండి.
  • ఇది మట్టి ఉపరితలం వద్ద లవణాలనుఉంచుతుంది.
  • పంట కోత తరవాత పొలాన్ని దున్నడం ద్వారా కెపిల్లరీ రంధ్రాలను విడదీయవచు.
  • తీవ్రమైన వేసవి సమయంలో పై మట్టికి ఉప్పు వ్యాప్తిని నిరోధించి, నేల తడిని రక్షించుకొనుటకు పంట కోత తరవాత వెంటనే పొలాన్ని దున్నండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి