అరటి

షుగర్ స్పాట్

Sugar Spot

ఇతర

5 mins to read

క్లుప్తంగా

  • పండు పైతొక్కపై గోధుమ రంగు మచ్చలు క్కనపడతాయి.
  • పండ్ల గుజ్జు మెత్తగా ఉంటుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

అరటి

లక్షణాలు

అరటి పంట కోత తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ప్రారంభంలో, అరటి తొక్కపై చిన్న చిన్న నల్లని మచ్చలు వృద్ధి చెంది, కాలక్రమేణా విస్తరిస్తాయి. పండ్ల గుజ్జు మీద కూడా గోధుమ రంగు మచ్చలను గమనించవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

పండ్ల అభివృద్ధి యొక్క ప్రక్రియ సహజమైనందున జీవ చికిత్స అవసరం లేదా అందుబాటులో లేదు.

రసాయన నియంత్రణ

పండ్ల అభివృద్ధి సహజ ప్రక్రియ అయినందువలన దీనికి రసాయన చికిత్స అవసరం లేదు మరియు అందుబాటులో లేదు.

దీనికి కారణమేమిటి?

అరటిపండ్లు సహజంగా పండిన ప్రక్రియ వల్ల లక్షణాలు వస్తాయి. పంట కోసిన తర్వాత కూడా అవి పండుతూనే ఉంటాయి. పిండి పదార్థం చక్కెరగా మార్పు చెందుతుంది అని ఈ మచ్చలు సూచిస్తున్నాయి. అదేవిధంగా, పెద్ద సంఖ్యలో గోధుమ రంగు మచ్చలు అధిక చక్కెర స్థాయిని సూచిస్తాయి. పాలీఫెనాల్ ఆక్సిడేస్ లేదా టైరోసినేస్ ఎంజైమ్ ఆక్సిజన్‌తో కలవడం ఈ గోధుమ రంగుకు కారణమని భావిస్తారు. ఇథిలీన్ అనే హార్మోన్ పండు యొక్క ఆమ్లాలతో చర్య జరుపుతుంది మరియు వాటిని విచ్ఛిన్నం చేస్తుంది, దీని ఫలితంగా అరటిపండు మెత్తగా మారుతుంది. పండుకి గాయాలైనప్పుడు సహజంగా గోధుమ రంగులోకి మారడం మరియు మెత్తబడే ప్రక్రియ మరింత స్పష్టంగా కనిపిస్తుంది.


నివారణా చర్యలు

  • ఈ గోధుమ రంగు మార్పిడి ప్రక్రియను మందగించడానికి, కోసిన పండ్లను చీకటి మరియు పొడి ప్రదేశాల్లో ఉంచండి.
  • ఆపిల్ లేదా టమోటాలు వంటి ఇథిలీన్ ఉత్పత్తి చేసే ఇతర పండ్లతో అరటిని నిల్వ చేయవద్దు.
  • ఫ్రిజ్ వంటి చల్లని వాతావరణంలో వీటిని నిల్వ చేయడం మంచిది కాదు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి