గోధుమ

మంచు వలన కలిగే నష్టం

Cell injury

ఇతర

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులు పాలిపోయి, రూపు మారుతాయి.
  • ఆకు కొనలలో కణ నాశనం జరుగుతుంది.

లో కూడా చూడవచ్చు

57 పంటలు
బాదం
ఆపిల్
అప్రికోట్
అరటి
మరిన్ని

గోధుమ

లక్షణాలు

ఆకు ఈనెల మధ్య ఎండిపోయి కమిలిన మరియు లేత గోధుమ రంగు అతుకులు కనిపిస్తాయి. అదనంగా వికసించిన మరియు లేత కాయలు దెబ్బతింటాయి. ఆకుల ఉపరితలాలపై గాయాలు లేదా గుంతలు, అలాగే రంగు పాలిపోవడం, నీటిలో తడిచినట్టు వున్న కణజాలం కనబడతాయి. దెబ్బతిన్న కణజాలం కమిలిపోయి దుర్వాసన రావచ్చు. ఆకులు ముందుగానే రాలిపోవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఇది సహజంగా సంభవించేది కాబట్టి జీవ నియంత్రణ సాధ్యం కాదు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవసంబంధమైన చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమగ్ర సస్యరక్షణ విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. ఇది సహజంగా సంభవించేది కాబట్టి రసాయన నియంత్రణ సాధ్యం కాదు.

దీనికి కారణమేమిటి?

మొక్క కణజాలం లోపల మంచు ఏర్పడి, మొక్క కణాలను గాయపరిచినప్పుడు మంచు వలన కలిగే నష్టం సంభవిస్తుంది, అందువల్ల, చల్లని ఉష్ణోగ్రత కంటే మంచు ఏర్పడటం అనేదే మొక్కను నిజంగా గాయపరుస్తుంది. వేర్లు భర్తీ చేసే తేమ కన్నా అధికంగా చల్లటి గాలులు ఎప్పుడూ పచ్చగా వుండే ఆకులనుండి తేమను తొలగిస్తాయి. దీని ఫలితంగా ఆకులు, ముఖ్యంగా ఆకు కొనలు మరియు అంచులు గోధుమ రంగులోకి మారుతాయి. పూర్తిగా బలపడిన మొక్కల కంటే లేత మొక్కలు మంచుకు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • మంచు ఎక్కువగా ఉండే ప్రాంతాలను నివారించడానికి నాటే స్థానాలను జాగ్రత్తగా ఎంచుకోండి.
  • సాధారణంగా స్థానిక స్థలాకృతిని బట్టి పల్లపు ప్రాంతాల్లో చల్లటి ఉష్ణోగ్రతలు ఉంటాయి.
  • అందువలన పల్లపు ప్రాంతాల్లో ఎక్కువ నష్టాన్ని గమనించవచ్చు.
  • చల్లని గాలి కూడుకునే ప్రదేశాలను తొలగించడానికి మరియు చల్లని గాలి బయటకు పోవడానికి వీలుగా భూమిని చదును చేయండి.
  • తర్వాతి మంచు కాలానికి రక్షణగా ఉండటానికి ఎండిన ఆకులు మరియు కొమ్మలను మొక్కలపై వదిలివేయండి.
  • క్రొత్తవి వృద్ధి చెందుతున్నప్పుడు ఎండిన భాగాలను కత్తిరించండి.
  • మంచు కురిసే సూచన ఉన్నప్పుడు ఉన్ని లేదా తగిన ఇతర రక్షణ పద్దతులతో మొక్కలను కప్పండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి