మొక్కజొన్న

వేగంగా ఎదిగే రుగ్మత

Rapid Growth Syndrome

ఇతర

5 mins to read

క్లుప్తంగా

  • ఆకస్మిక పెరుగుదల మరియు అత్యంత వేగవంతమైన వృద్ధి రేటు.
  • వక్రీకరణ చెందిన మరియు గట్టిగా చుట్టబడిన మొవ్వ.
  • కొత్తగా విచ్చుకునే ఆకులు అవి విచ్చుకునేటప్పుడు ప్రకాశవంతమైన పసుపు రంగులోకి మారుతాయి.
  • ప్రభావిత ఆకులు మొదలు వద్ద ముడతలు పడవచ్చు.

లో కూడా చూడవచ్చు


మొక్కజొన్న

లక్షణాలు

మొక్కలు చాలా వేగంగా ఎదుగుతాయి. ఆకులు సరిగా విచ్చుకోవడంలో విఫలమవుతాయి మరియు మొవ్వ గట్టిగా చుట్టుకుపోయి వంకరగా మారుతుంది. వేగంగా పెరిగే కొత్త ఆకులు విచ్చుకోవు మరియు అవి బలవంతంగా విచ్చుకునేటప్పుడు మొవ్వ వంగిపోయి మెలితిరిగిపోయేలా చేస్తాయి. మొవ్వలో చిక్కుకున్న ఆకులు విచ్చుకునేటప్పుడు చాలా తరచుగా ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉంటాయి, వాటిని పొలంలో చాలా సులభంగా గుర్తించవచ్చు. ప్రభావిత ఆకులు మొదలు వద్ద ముడుచుకుపోవచ్చు మరియు ఎదిగే సీజన్ మొత్తం అలాగే ఉంటాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

అనేక వాతావరణ-సంబంధిత ఒత్తిడి ప్రభావాల మాదిరిగానే, కొన్ని రకాల సంకరజాతుల్లో, ఇతర విత్తన రకాల కన్నా వేగవంతమైన పెరుగుదల రుగ్మతకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

రసాయన నియంత్రణ

దీనికి ఎటువంటి రసాయన నియంత్రణ లేదు.

దీనికి కారణమేమిటి?

సాధారణంగా చల్లని ఉష్ణోగ్రతల నుండి వెచ్చని పరిస్థితులకు ఆకస్మిక మార్పుతో, జరిగే నష్టం ముడిపడి ఉంటుంది, ఫలితంగా మొక్కల పెరుగుదల రేటు బాగా వేగవంతమౌతుంది. వేగంగా పెరిగే కొత్త ఆకులు విచ్చుకోలేవు మరియు అవి బలవంతంగా విచ్చుకునేందుకు ప్రయత్నించినప్పుడు మొవ్వ వంగి మెలితిరిగిపోయేలా చేస్తాయి. ఈ రుగ్మత సాధారణంగా 5 నుండి 6 వ ఎదుగుదల దశ మధ్య సంభవిస్తుంది కానీ 12 వ ఎదుగుదల దశ వరకు కూడా ఈ రుగ్మతని గమనించవచ్చు. సాధారణంగా దిగుబడిపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఉండవు. ఇతర కారణాల వల్ల, ముఖ్యంగా కలుపు మందుల వలన కలిగే నష్టం వల్ల కూడా మొవ్వలు వంకర తిరిగే అవకాశం ఉంటుందని గమనించండి.


నివారణా చర్యలు

  • దీనికి ఎటువంటి నివారణ చర్యలు లేవు.
  • ప్రభావిత మొక్కల ఆకులు సాధారణంగా కొన్ని రోజుల తర్వాత విచ్చుకుంటాయి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి