ఇతరములు

పండు పగుళ్లు

Physiological Disorder

ఇతర

5 mins to read

క్లుప్తంగా

  • చల్లదనం వలన గాయం, పైతోక్క పాడవ్వడం, గుళికలు ఏర్పడడం, ఉబ్బడం మరియు పండు పగుళ్లు, పండ్ల ఉపరితలంపై కనిపిస్తాయి.
  • మూడు రకాల పగుళ్లు: వృత్తాకారం, ఫైన్ లేదా లోతైన పగుళ్లు.

లో కూడా చూడవచ్చు

7 పంటలు
ఆపిల్
కాకరకాయ
నిమ్మజాతి
వంకాయ
మరిన్ని

ఇతరములు

లక్షణాలు

పండు కాడ నుండి పండ్ల మధ్యకు తీవ్రమైన పగుళ్లు వృద్ధి చెందుతాయి. పండు రేడియేషన్‌తో బాధపడుతోంది. పండుపై కనిపించే గుండ్రటి వలయాలు పగుళ్లకు దారితీస్తాయి. పండు పగలడం అనేది క్రమంగా జరిగే ప్రక్రియ, మరియు ఇది మూడు దశల్లో జరుగుతుంది: ప్రారంభ, మధ్య మరియు తరువాత దశలు. పండ్ల పగుళ్లు ప్రారంభ దశలో, పండు యొక్క ఉపరితలంపై గోధుమ రంగు గీత కనిపించడం ప్రారంభమవుతుంది మరియు పైపొర చీలిపోతుంది. అప్పుడు, చమురు గ్రంథులు వైకల్యం చెందడంతో ఒక పగులు కనిపిస్తుంది. చమురు గ్రంథులు తీవ్రంగా చీలిపోతాయి, తరువాత పండ్ల ఉపరితలం మరియు కణాలు తీవ్రంగా దెబ్బతింటాయి మరియు విరిగిన ఆల్బెడో కణాల మధ్య పెద్ద ఖాళీ ఏర్పడుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

క్లిష్టమైన సమయానికి ముందు మరియు క్లిష్ట సమయంలో అదనపు శ్రద్ధ తీసుకుని తీవ్రమైన నష్టాలను తగ్గించండి. చెట్లకు తగినంత నీరు, పోషకాలు అందుబాటులో ఉంచాలి. నేల పరిస్థితిని మెరుగుపరచడానికి బంకమన్ను మరియు కంపోస్ట్ జోడించండి. ఒక్కసారే అకస్మాత్తుగా మొక్కకు పోషకాలు అందకుండా ఉండడానికి ఎరువులను నెమ్మదిగా విడుదల చేసి, కంపోస్ట్‌ను ఉపయోగించండి. రక్షక కవచాన్ని ఉపయోగించి నేల తేమను నిలుపుకోవడం ద్వారా బాష్పీభవనాన్ని తగ్గించండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పండ్ల పగుళ్లను తగ్గించడానికి లేత పండ్లపై కాల్షియం సమ్మేళనాలు లేదా జిఏ 3 ను 120 ppm వద్ద పిచికారీ చేయాలి. పండు ముడుతను గణనీయంగా తగ్గించడానికి పొటాషియం ఎరువులు, కాల్షియం ఎరువులు మరియు బోరాన్ ఎరువుల పిచికారీలు చేయాలి. పండ్ల పైతొక్క వృద్ధిని ప్రోత్సహించడానికి, పైతొక్క మందాన్ని పెంచడానికి, పండ్ల పగుళ్లు నిరోధక సామర్థ్యాన్ని పెంచడానికి మరియు పంటకు ముందు పండ్ల పగుళ్లను తగ్గించడానికి పండ్ల ప్రారంభ వృద్ధి సమయంలో పొటాషియంను వాడండి.

దీనికి కారణమేమిటి?

ఉష్ణోగ్రత, తేమ మరియు నిర్వహణ పద్ధతులు వంటి ప్రతికూల పర్యావరణ పరిస్థితుల కారణంగా పంట కోత తరువాత ఈ రుగ్మతులు వృద్ధి చెందవచ్చు అయితే కోతలకు ముందు ఈ పగుళ్ళకు బోరాన్, రాగి మరియు మాంగనీస్ వంటి సూక్ష్మపోషకాల లోపం కారణం కావచ్చు. పండ్ల పరిమాణం మరియు ఆకారం నిమ్మ పండు పగులుపై కొంచెం ప్రభావాన్ని కలిగి ఉంటుంది. పెద్ద పండ్లు ఈ పగుళ్ళకు అధికంగా గురికావచు. సిట్రస్ పండు పైతొక్క ముడుతలు మరియు పండు పగుళ్లపై వీటి అంటు మొక్కల ప్రభావం పరోక్షంగా ఉంటుంది. కాంతి తీవ్రతలో రోజువారీ వైవిధ్యాలు, రోజువారీ పండ్ల ముడుతలపై పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి. భౌతికంగా పండు రాలే కాలానికి ముందు అధిక సగటు సాపేక్ష ఆర్ద్రత పండ్ల ముడుతలు పడే అవకాశాన్ని పెంచుతుంది. పాక్షిక పైతొక్కలో తగినంత పోషకాలు లేకపోవడం వలన పైతొక్కలో వృద్ధి మరియు జీవక్రియ లోపాలను కలిగిస్తాయి. అందువలన బాహ్య ప్రతికూల వాతావరణం ప్రేరేపణ వలన పండ్లలో ముడుతలు మరియు పగుళ్లు ఏర్పడతాయి.


నివారణా చర్యలు

  • నీటిపారుదల యొక్క ఫ్రీక్వెన్సీని పెంచడం ద్వారా తేమ తీవ్రతను నివారించండి.
  • అధిక-నాణ్యత పండు మరియు దిగుబడి పొందడానికి, ఈ లక్షణాలు కనపడడానికి ముందుగా సూక్ష్మపోషకాల లోపాలను గుర్తించాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి