ప్రత్తి

కలుపు నివారణ మందుల వలన మొక్కలు తెల్లబారడం

Herbicides Photosynthesis Inhibitors

ఇతర

5 mins to read

క్లుప్తంగా

  • ఈనెల మధ్యన ఆకులు పసుపు రంగులోకి మారతాయి.
  • ఆకుల అంచులు పసుపు రంగులోకి మారి పైకి ముడుచుకు పోతాయి.
  • అధిక మోతాదుల వద్ద "బ్లీచింగ్" మరియు కణజాలం చనిపోవడం జరుగుతుంది.
  • పూర్తి సూర్యరశ్మిలో ఈ తెగులు లక్షణాలు చాలా త్వరితంగా వృద్ధి చెందుతాయి.

లో కూడా చూడవచ్చు


ప్రత్తి

లక్షణాలు

వాడిన మందు, వాడిన సమయం మరియు మోతాదుపైన లక్షణాలు ఆధారపడి ఉంటాయి. , లేత ఆకులతో పోలిస్తే ముదురు ఆకులు దీనికి బాగా ప్రభావితం అవుతాయి. ఆకులు అంతర్నాళ క్లోరోసిస్ లేదా రంగు రంగు మచ్చలు ఏర్పడడం మరియు ఈనెల మధ్య భాగం కణజాలం పసుపు రంగులోకి మారడం జరుగుతుంది. ఆకుల అంచులు పసుపు రంగులోకి మారి పైకి ముడుచుకు పోతాయి. మెల్లగా ఆకులు తేమను కోల్పోయి రెండు నుండి ఐదు రోజులలో రాలిపోతాయి. పూర్తి సూర్యరశ్మిలో ఇది మరింత ఉదృతం అవుతుంది (పేపర్ బాగ్ వలే కనపడుతుంది). ఆకులపైన వేగవంతమైన మరియు హానికరమైన ప్రభావం వలన తరచుగా ఇవి "బ్లీచర్స్" గా అర్హత సంపాదించుకుంటాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ నష్టాన్ని నివారించడానికి ఎటువంటి జీవన నియంత్రణ పద్దతి అందుబాటులో లేదు. ఈ నష్టం కలగకుండా నివారణ చర్యలు మరియు మంచి యాజమాన్య పద్ధతులు పాటించడం చాలా ముఖ్యం.

రసాయన నియంత్రణ

కలుపు నివారణ మందులను వాడేముందు మీరు ఏ రకం కలుపు మొక్కల పైన(సాధారణంగా బ్రాడ్ లీఫ్ vs గడ్డి రకాలు) ఈ మందును వాడుతున్నారో, ఏ మందు మీ అవసరాలకు సరిపోతుందో తెలుసుకోండి. కలుపు నివారణ మందును జాగ్రత్తగా ఎంచుకోండి. డబ్బా పైన వున్న లేబుల్ను జాగ్రత్తగా చదివి దానిపైన రాసిన సూచనలు, మోతాదులను అనుసరించండి.

దీనికి కారణమేమిటి?

అట్రాజిన్, బ్రోమోక్సినిల్, డియూరన్ మరియు ఫ్లూమెటురాన్ వంటి పిఎస్II గ్రూపుకు చెందిన కలుపు నివారిణుల వలన ఈ నష్టం కలుగుతుంది. ఇవి కిరణజన్య సంయోగక్రియను అడ్డుకుని కణజాలంలో వుండే పచ్చ రంగును నాశనం చేస్తాయి. దీనివలన ఆకులు రంగు కోల్పోతాయి. కలుపు మొక్కలు రాకుండానే మట్టిలో వాడే కలుపు మందుల వలన ఇవి వేర్ల ద్వారా గ్రహించబడి చిగుర్లచే సంగ్రహించబడతాయి. చివరకు ఇవి ముఖ్యంగా ఆకుల అంచుల వద్ద ఆకులపైన చేరతాయి. కలుపు మొక్కలు వచ్చిన తర్వాత వాడే కలుపు మందులవలన స్థానిక మొక్కల కణజాలాన్ని నష్టం కలగచేసి మొక్కలో ఇతర భాగాలకు విస్తరించవు. చాలా రకాల కలుపు మొక్కలలో( ఉదాహరణకు గడ్డి రకాలు, ఆవాలు, స్టింగింగ్ నెట్టెల్ మరియు అడవి ముల్లంగి) నిరోధకత వృద్ధి చెందడం సమస్యాత్మకంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • మీరు ఏ రకం కలుపు మొక్కలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారో ( సాధారణంగా బ్రాడ్ లీఫ్ కలుపు మొక్కలు లేదా గడ్డి రకాలు) ముందుగా తెలుసుకోండి.
  • మీ అవసరాలకు తగిన కలుపు నివారిణిని జాగ్రత్తగా ఎంచుకోండి.
  • డబ్బా పైన లేబిల్ ను జాగ్రత్తగా చదివి దానిపై రాసిన సూచనలను మరియు మోతాదులను అనుసరించండి.
  • ఇతర కలుపు నివారిణులతో కలుషితం కాకుండా వాడిన తర్వాత పిచికారి డబ్బాను బాగా శుభ్రం చేయండి.
  • చుట్టూ ప్రక్కల పొలాలకు ఈ మందులు విస్తరించకుండా ఉండడానికి గాలి అధికంగా వున్నప్పుడు వీటిని వాడకండి.
  • చుట్టు ప్రక్కలకు విస్తరించకుండా కలుపు మొక్కలపై గురిగా పిచికారీ చేయడానికి వీలైయ్యే నాజిల్ ను ఉపయోగించండి.
  • ఈ కలుపు నివారిణులను పచ్చిక బయళ్ళ పైన మరియు ఎండు గడ్డి పొలాల్లోను వాడి వీటి ఫలితాలను గమనించండి.
  • వాతావరణ సూచనలను జాగ్రత్తగా గమనిస్తూ వర్షం వచ్చే సమయంలో ఈ మందులను వాడకండి.
  • ఈ మందులను ఎప్పుడు వాడింది, ఏ మందు వాడింది, పొలం వున్న ప్రాంతం, మరియు వాతావరణ పరిస్థితులను రాసుకుని జాగ్రత్త చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి