ప్రత్తి

ప్రత్తి ఆకులు ఎర్రబారడం

Leaf Reddening

ఇతర

5 mins to read

క్లుప్తంగా

  • మొదట ఆకు అంచులు ఎరుపు రంగులోకి మారుతాయి.
  • తరువాత ఆకు మొత్తం రంగు కోల్పోతుంది.
  • కాడలు వాలిపోయి ఎర్రబడుతుంది.
  • ఆకు మరియు పండ్లు రాలిపోతాయి.
  • వృద్ధి కుంగిపోతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ప్రత్తి

లక్షణాలు

పంట దశను బట్టి మరియు ఇతర కారణాలవలన ఆకులు ఎర్రబడడం జరగవచ్చు. అనేక సందర్భాల్లో, ఆకు కొనలు ఎర్రగా మారి తరువాత రంగు మారిపోయి మిగిలిన అంచులకు వ్యాపిస్తుంది. ఆకులు వాడిపోవడం, కాండం ఎర్రబడడం, కాయ ఏర్పడకపోవడం లేదా కాయ సరిగ్గా ఏర్పడకపోవడం, ఆకు మరియు కాయ రాలిపోవడం మరియు మొక్కలు సరిగ్గా ఎదగక పోవడం ఇతర లక్షణాలుగా వుంటాయి. మొక్కలు పూర్తిగా ఎదిగిన తర్వాత రంగు పాలిపోవుట అనేది సాధారణ ప్రక్రియ. ఇది పొలం మొత్తం అంతటా కనిపించే ఒక సహజ ప్రక్రియ. నత్రజని లోపం వలెనే కాకుండా, ఎండ అధికంగా తగలడం, చల్లని వాతావరణం మరియు అధికంగా గాలి సోకడం కూడా ఆకు ఎర్రబడడానికి ఒక కారణం. ఆ సందర్భంలో పొలం మొత్తం కన్నా, ఆకుల వారీగా ప్రభావం ప్రభావం చూపుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఒత్తిడి మరియు ఎదిగే దశ ఆధారంగా, సేంద్రీయ ఎరువుల ఉపయోగం మొక్కకు ప్రయోజనకరంగా ఉంటుంది. సీజన్ చివర్లో ఈ ఆకు ఎర్రబారడం మొదలైతే లేదా ప్రక్రియ భౌతిక కారకాలు ద్వారా ప్రేరేపించబడితే జీవసంబంధిత నియంత్రణ అవసరం లేదు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ప్రత్తి పంటల్లో ఎర్రబారడాన్ని నియంత్రించుటకు రసాయనిక నియంత్రణ అందుబాటులో లేదు. పెరటి ఎరువు, చక్కని నీటిపారుదల కార్యక్రమం మరియు సమతుల్య ఎరువు వేయడం వంటి మంచి కార్యక్రమాలు సమస్యను నివారించడానికి సహాయపడగలవు. అదను ప్రారంభంలో సంభవిస్తే, పోషకాల సవరణలు సమస్యను పరిష్కరించడానికి సహాయపడవచ్చు. ఒక వేళ లక్షణాలు మొదటి ప్రత్తి కాయలు పగిలే సమయంలో సంభవిస్తే ఏరకమైన నివారణ చర్యలు తీసుకోవలసిన అవసరం లేదు.

దీనికి కారణమేమిటి?

నీరు, నిరంతర ఉష్ణోగ్రత ఒత్తిడి లేదా సారవంతం కాని నేలల వంటి అనేక బౌతిక విషయాల వలన లక్షణాల సంభవించవచ్చు. ఇతర వాటికన్నా కొన్ని రకాలు లేదా హైబ్రిడ్ మొక్కలకు తెగులు సోకే అవకాశం ఎక్కువ. ఆంతోసెయనిన్ అని పిలువబడే ఎరుపు వర్ణద్రవ్యం పెరగడం వలన మరియు ఆకులలో ఆకుపచ్చ వర్ణద్రవ్యం, పత్రహరితం తగ్గడం వలన ఎర్రబడటం జరుగుతుంది. వేర్లు నిర్జీవంగా అవడం వలన ఇది చురుకుగా నీరు మరియు పోషకాలను తీసుకునే మొక్క సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. మొక్క వయస్సు పైబడిన తరవాత ఈ ప్రక్రియ సహజంగా ఉంటుంది కనుక దిగుబడిపై ప్రతికూల ప్రభావాన్ని కలిగించదు. అదను మొదటిలో నత్రజని, భాస్వరం మరియు పొటాషియం యొక్క లోపం వలన కూడా ఈ లక్షణాలు కలగవచ్చు. ఇవే కాక అధికంగా ఎండ తగలడం, గాలి మరియు చల్లని ఉష్ణోగ్రతలు కూడా ఆకులు పాలిపోవడానికి కారణం అవుతాయి.


నివారణా చర్యలు

  • కాయలు ఏర్పడే సమయంలో అధిక మట్టి ఉష్ణోగ్రతలు నివారించేందుకు సిఫార్సు చేయబడ్డ సమయంలో నాటండి.
  • మొక్కల మధ్యన సరైన దూరం ఉంచి నాటండి.
  • బౌతిక ఒత్తిడి తట్టుకునే పత్తి రకాలను నాటండి.
  • నేలకు తగినంత సేంద్రియ ఎరువు అందేలా చూసుకోండి.
  • నేరుగా గాలి సోకడం వంటి బౌతిక ఒత్తిడి నుండి పంటలను రక్షించండి.
  • మొక్క అవసరాలకు అనుగుణంగా ఒక సరైన నీటిపారుదల ప్రణాళికను తయారు చేసుకోండి.
  • మట్టిలో పోషకాలను గమనించి, సమతుల్య పోషక నిర్వహణ పద్ధతులను వర్తింప చేయండి.
  • పంట కోసిన తరువాత నేలను లోతుగా కలియ దున్నండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి