ప్రత్తి

పారావిల్ట్

Parawilt

ఇతర

5 mins to read

క్లుప్తంగా

  • నీరు నిలువ వుండే పొలాల్లో అత్యంత వేగంగా పెరిగే ఈ పారా విల్ట్ అనేది ఒక భౌతికమైన రుగ్మత.ఆకులు ఎండిపోవడం మరియు రంగుమారడం దీని లక్షణాలు.
  • ఈ తెగులు విస్తరించేకొలది ఆకులు రంగు రాలిపోవడం నుండి కాంస్యం/ ఎరుపు రంగులోకి మారతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ప్రత్తి

లక్షణాలు

పారావిల్ట్ ను "సడెన్ విల్ట్" అని కూడా పిలుస్తారు. ఇది పొలంలో చెదురుమదురుగా కొన్నిప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది ఒకే నమూనాలో పొలంలో కనిపించదు. దీని లక్షణాలను ఇతర తెగుళ్ల లక్షణాలకు పోలిక ఉండడం వలన అయోమయానికి గురిచేస్తుంది. ఎండిపోవడం మరియు రంగు మారిపోవడం దీని ముఖ్యమైన లక్షణాలు. ఆకులు రంగు కోల్పోవడం నుండి కాంస్య లేదా ఎర్రని రంగులోకి మారతాయి. తరువాత కణజాలం నిర్జీవమవుతుంది. వేగంగా పెరిగే మొక్కలు మరియు అధికంగా పైఆకులు మరియు అధిక మొత్తంలో ప్రత్తి కాయలు వున్న మొక్కలలో ఈ రుగ్మత బాగా అధికంగా ప్రభావం చూపిస్తుంది. కాయలు మరియు ఆకులు ముందుగానే రాలిపోవడం కాయలు విచ్చుకుపోవడం జరుగవచ్చు. మొక్క కోలుకోవచ్చు కానీ దిగుబడి మాత్రం తగ్గుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ రుగ్మతను నివారించేందుకు ఎటువంటి జీవన నియంత్రణ పద్దతి అందుబాటులో లేదు. ఈ రుగ్మతను రాకుండా నివారించడానికి నీరు మరియు ఎరువులను సమతుల్యంగా వాడడం మరియు మంచి మురుగు నీటి సౌకర్యాన్ని ఏర్పాటుచేసుకోవడం ముఖ్యం

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పారావిల్ట్ ను నివారించడానికి ఎటువంటి పద్దతి అందుబాటులో లేదు. కానీ వేర్ల చుట్టూ వున్న అధిక నీటిని మురుగు కాలువ ద్వారా తొలగించడంతో మీరు కొంత వరకు దీనిని నివారించవచ్చు. తరువాత ఒక లీటరు నీటిలో 15 గ్రాముల యూరియా, 15 గ్రాముల మ్యురేట్ ఆఫ్ పోటాష్ మరియు 2 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ కలిపి ద్రావణాన్ని తయారుచేసి 100 -150 ద్రావణాన్ని వేర్ల దగ్గర వేయండి. ఈ ద్రావణం మొక్కకు కావలసిన పోషకాలను తక్షణం అందిస్తుంది మరియు ఫంగల్ తెగుళ్లను రాకుండా నివారిస్తుంది.

దీనికి కారణమేమిటి?

పారావిల్ట్ అనేది ఒక భౌతిక రుగ్మత, అంటే ఫంగస్, బాక్టీరియా, వైరస్ వలన సంక్రమించదు. ప్రత్తిలో ఇతర తెగుళ్ళ లేదా ఇటువంటి లక్షణాలను కలిగించే ఇతర కారణాలతో పోలిస్తే పోలిస్తే ఇది ఎటువంటి ప్రత్యేకమైన నమూనాను బహిర్గతం చేయకుండా కొన్ని గంటలలోనే వృద్ధి చెందుతుంది. చెదురు మదురుగా విస్తరించివుండడం మొత్తానికి ఏర్పడడం దీని లక్షణం. వేర్ల చుట్టుప్రక్కల అకస్మాత్తుగా నీరు నిలువవుండడం వలన ( ఉదృతంగా వర్షం పాడడం ఎల్ద ధికంగా నీరు పెట్టడం) మరియు వెంటనే అధిక ఉష్ణోగ్రత మరియు మండే ఎండలవలన ఈ రుగ్మత వస్తుంది అని ఇపుడు తెలిసింది. వేగంగా మొక్కల ఎదగడం మరియు పోషకాల సమతుల్యత లేకపోవడం కూడా జరుగుతుంది. అధికంగా సుద్ద వున్న మట్టి నేలల్లో లేదా సరైన మురుగు నీటి సౌకర్యం లేనప్పుడు మొక్కలలో ఈ రుగ్మత కలిగే అవకాశం అధికంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • ఈ పారావిల్ట్ ను తట్టుకునే హైబ్రీడ్ రకాలను వాడండి.
  • పొలంలో నీరు నిలువ ఉండకుండా వుండేవిధంగా సరైన మురుగు నీటి సౌకర్యాన్ని ఏర్పాటుచేసుకోండి.
  • ఎదుగుదల దశలలో లేదా పొడి పరిస్థితులలో అవసరమైతే కానీ మొక్కలకు తరచుగా కానీ అధికంగా కానీ నీరు పెట్టకండి.
  • పంటను క్రమం తప్పకుండ గమనిస్తూ వుండండి.
  • (ముఖ్యంగా అధిక వర్షపాతం తర్వాత వెంటనే అధిక ఉష్ణోగ్రతలు వున్నప్పుడు మరియు తీవ్రమైన ఎండ వున్నప్పుడు) అధిక పెరుగుదలకు నివారించడానికి అధిక మోతాదులలో ఎరువులను వాడకండి.
  • అధిక వర్షపాతం మరియు అధిక ఎండ తీవ్రతలను నివారించడానికి విత్తనాలు వేసే తేదీలను మార్చండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి