నిమ్మజాతి

నిమ్మజాతిలో గాలి వలన నష్టం

Wind Damage on Citrus

ఇతర

5 mins to read

క్లుప్తంగా

  • గాలి వలన మీ పంటలో మొక్కల ఎదుగుదల, నిర్మాణం మరియు రూపంలో విభిన్న మార్పులు కలగవచ్చు.
  • భౌతికంగా ఆకులు రాలిపోవడం, పండ్లు దెబ్బతినడం అధిక ఒత్తిడితో మొక్కలకు ఇసుక తగలడం వలన అవి వాడిపోవడం లాంటివి జరుగుతాయి.
  • దీనివలన మొక్కలపైన కొట్టుకుపోయినట్టు అవ్వడం మరియు కణజాలం విడిపోవడం జరుగుతుంది.
  • బాగా తీవ్రమైన పరిస్థితులలో చాలా తక్కువ మొత్తంలో పండ్లు ఏర్పడడం మరియు నాణ్యతపై ప్రభావం పడి దిగుబడి తగ్గిపోవడం జరగవచ్చు.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

తామర పురుగుల వలన కలిగే నష్టం మరియు గాలి వలన కలిగే నష్టం లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. బలమైన గాలులు వీస్తున్నప్పుడు లేత చెట్ల యొక్క పై వేర్లు మరియు బెరడు సాండ్ బ్లాస్టింగ్ వలన నష్టానికి గురవుతాయి. దీని వలన ఆకులు మరియు కాండాల మీద గాయాలు కూడా ఏర్పడతాయి కానీ అక్కడి నష్టం చెప్పుకోతగ్గ స్థాయిలో ఉంటుంది. గాలి ఒత్తిడి వలన ఎదుగుదల మరియు దిగుబడి కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గిపోతుంది. గాలి తగిలిన వైపు చెట్టుకు తక్కువగా పండ్లు రావడం లేదా అసలు పండ్లు లేకపోవడం జరుగుతుంది. సీజన్లో తరువాత సమయంలో లేత పండ్లకు( 8 మిల్లీమీటర్ల వ్యాసార్థం) ఈ గాలి వలన బాగా అధికంగా నష్టం కలుగుతుంది. పండ్ల పైతొక్క మీద ఒకటి లేదా అనేక అడ్డంగా వున్న లేదా ఎదురెదురుగా బూడిద రంగు మచ్చలు కనపడతాయి. తామర పురుగుల తెగులుతో పోలిస్తే గాలి వలన కలిగే నష్టం వలన పండుపై చిన్న ప్యాచీలుగా శుభ్రంగా వున్న కణజాలం కనపడుతుంది. కానీ తామర పురుగుల వలన కలిగిన తెగులులో మచ్చలు ఒకదాని వెనక ఇంకొకటి కొనసాగుతూ ఉంటాయి. బలమైన గాలుల వలన కొమ్మలు విరిగిపోయి మొక్కలు వంగిపోవడం లేదా చెట్లు పెకిలించబడడం కూడా జరుగుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ముందుగా జరిగిన నష్టాన్ని అంచనా వేయండి. దానిని బట్టి మరియు మొక్క ఎదుగుదల దశను బట్టి చెట్లను కొనసాగించాలా లేదా అన్నది నిర్ణయించుకోవాలి. ప్రూనింగ్ లేదా కత్తిరింపు పరికరాలను ఉపయోగించి దెబ్బతిన్న కొమ్మలను మరియు పండ్లను తొలగించండి. తేమ వాతావరణం వున్న సమయాలలో బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ వ్యాధులు సంక్రమించే అవకాశం వున్న ప్రాంతాలలో సేంద్రీయ పేస్టులను పూయండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ నివారణా చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఎటువంటి చికిత్స చేయాలి అనేది ఎదుగుదల దశ మరియు పంటకు ఎంత నష్టం జరిగింది అనేదాని పైన ఆధారపడివుంటుంది. తీవ్రమైన పరిస్థితులలో మొక్కలకు ఫంగల్ మరియు బ్యాక్టీరియల్ వ్యాధులు సంక్రమించకుండా చికిత్స పద్దతులను ఎంచుకోవాలి. ఉదాహరణకు దెబ్బతిన్న మొక్కల భాగాలను కత్తిరించడం మరియు శిలీంద్ర నాశినులు మరియు యాంటీ బ్యాక్టీరియల్ ఉత్పత్తులను వాడటం లాంటివి.

దీనికి కారణమేమిటి?

లక్షణాలు గాలి ద్వారా ఏర్పడతాయి మరియు ముఖ్యంగా గాలి నిరోధకాలు లేని అసురక్షిత ప్రాంతాలలో ఆందోళన కలిగిస్తాయి. గాలి తరుచుగా లేదా బలంగా వీస్తే, నిమ్మ పంటలోని చాలా భాగం యొక్క నాణ్యత తగ్గవచ్చు లేదా నిరాకరించబడవచ్చు. ఉపరితలం వెంబడి పాత ఆకులు ఎగిరిపోవడం వలన లేత పండ్ల మీద మచ్చలు ఏర్పడతాయి. ఒక రక్షణాత్మక, కార్కి పొర ఏర్పరడటం ఫలితంగా రంగు పాలిపోవడం జరుగుతుంది. పండు 3 సెం.మీ సైజు కు రాగానే తొక్క గట్టిపడుతుంది, ఎండిపోయిన రెమ్మలు మరియు కొమ్మలు గీసుకోపోవడం వలన చాలా భాగం నష్టం వాటిల్లుతుంది. కణజాలానికి నష్టం వాటిల్లడం అనేది బాక్టీరియా మరియు ఫంగస్ లకు కణజాలంలోకి ప్రవేశించి ఆవాసం ఏర్పరచుకొని మరింత నష్టం కలిగించడానికి ఒక అవకాశంగా వుంటుంది. ముఖ్యంగా పొడి గాలులు ఆకులను రాల్చడం, రాపిడి మరియు కాలిన గాయాల ద్వారా చెట్లకు నష్టం కలుగజేస్తాయి, దాంతో ఆకులు చనిపోవడం మరియు పండ్లపై గాట్లు పడటం జరుగుతుంది.


నివారణా చర్యలు

  • గాలి వాటం, దిశ మరియు గాలి ఎంత తరుచుగా వీస్తుంది అనే దానినిబట్టి శాశ్వతమైన లేదా అవసరాన్ని బట్టి గాలి నిరోధకాలు ( చెట్లు) ఏర్పాటుచేయండి.
  • చెట్లను కాపాడడానికి గాలి నిరోధకాలను రిపేర్ చేసి కొనసాగించేలా చూడండి.
  • గాలి వీస్తుందని అంచనా వేయబడినపుడు మట్టిలో తేమ అధికంగా ఉండేటట్లు చూడండి.
  • నష్టం తర్వాత అవసరమైతే నత్రజనిని అదనపు మోతాదులో వాడి కొత్తగా మొక్కలు వృద్ధిచెందేటట్టు కూడా చేయవచ్చు.
  • గాలి తీవ్రత అధికంగా వున్నప్పుడు లేక వివిధ దిశలనుండి గాలి వీస్తున్నప్పుడు మీరు ఒకటి కన్నా అధికంగా ఈ గాలి నిరోధకాలను ఏర్పాటుచేసుకోవచ్చు.
  • గాలి యొక్క దిశను బట్టి మొక్కలను సరైన రీతిలో కత్తిరించి గాలి వలన నష్టం కలగకుండా చూసుకోండి.
  • తర్వాతి సీజన్లో నష్టాన్ని నివారించడానికి కోత తర్వాత చచ్చిపోయిన చెట్లను కత్తిరించడం మర్చిపోకండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి