చెరుకు

బ్యాండెడ్ క్లోరోసిస్

Physiological Disorder

ఇతర

5 mins to read

క్లుప్తంగా

  • లేత ఆకులపై లేత ఆకుపచ్చ నుండి తెలుపు లేదా పసుపు రంగు పట్టీలు ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

చెరుకు

లక్షణాలు

ఆకు రెండు వైపులా లేత ఆకు పచ్చ నుండి తెలుపు సమాంతర మచ్చలు ఏర్పడతాయి రంగు మారిన పట్టీలు ముదురు ఆకుల మొదలు వద్ద కనిపించి క్రమంగా లేత ఆకుల దగ్గరకు వ్యాపిస్తాయి. పొలంలో, భూమి నుండి ఒకే ఎత్తులో వుండే వివిధ మొక్కలపై లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని ప్రభావిత ఆకుల ప్యాచ్‌లు లేదా పట్టీలలో నిర్జీవ మచ్చలు మరియు చిన్న ముక్కలను గమనించవచ్చు. సాధారణంగా ఈ అసాధారణత పొట్టి గా వుండే చెరుకులో ఉండదు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఇప్పటివరకు ఈ రుగ్మతకు వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న జీవ నియంత్రణ పద్ధతి గురించి మాకు తెలియదు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ సంబంధిత చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమగ్ర విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. దీని వలన కలిగే నష్టం మొక్కను గణనీయంగా ప్రభావితం చేయదు.

దీనికి కారణమేమిటి?

బ్యాండెడ్ క్లోరోసిస్ అనేది ఒక భౌతిక రుగ్మత. ఇది ప్రధానంగా, అకస్మాత్తుగా ఉష్ణోగ్రత పడిపోవడం వలన కలుగుతుంది. ఇది కుదురు లోపల ఇంకా విప్పబడని ఆకుల భాగాలను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా కొన్ని వారాల తర్వాత మాత్రమే, ఆకులు పెద్దవి అయిన తర్వాత నష్టం కనిపిస్తుంది మరియు పంట దిగుబడి మరియు ఇతర యంత్రాంగాలను గణనీయంగా ప్రభావితం చేయదు. 2.7 మరియు 7°C మధ్య ఉష్ణోగ్రతలు ఈ రుగ్మతకు అనుకూలంగా ఉంటాయి. లోతట్టు ప్రాంతాల్లోని పొలాల కంటే మెట్ట ప్రాంతాలలోని పొలాలు ఈ రుగ్మతకు ఎక్కువగా ప్రభావితమవుతాయి. ఈ రుగ్మత కొన్ని సున్నితమైన, ప్రత్యేకించి ముఖ్యంగా ఆకులు సహజంగా వంగి వుండే సాగు రకాల్లో వేడి వల్ల కూడా సంభవించవచ్చు.


నివారణా చర్యలు

  • సీజన్లో ముందుగా నాటడాన్ని ప్రాక్టీస్ చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి