పుచ్చకాయ

టొమాటోలో స్పాటేడ్ విల్ట్ వైరస్

TSWV

వైరస్

5 mins to read

క్లుప్తంగా

  • ఆకుల పైన ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తరువాత విస్తరించి అతుకులవలె మారతాయి.
  • ఎదుగుదల మందగిస్తుంది.
  • ఇంకా పక్వానికి రాని పండ్లపైన లేత పచ్చ రంగు వృత్తాకార మచ్చలు ఏర్పడతాయి.
  • మగ్గిన పండ్లపైన గోధుమ రంగు వలయాలు మరియు మచ్చలు ఏర్పడతాయి.
  • అప్పుడప్పుడు పండ్ల రూపు మారుతుంది.

లో కూడా చూడవచ్చు


పుచ్చకాయ

లక్షణాలు

ఆకులపై ఊదా లేదా గోధుమ రంగు మచ్చలతో, లేత ఆకులు మాడిపోవడం ఈ తెగులు ప్రారంభ లక్షణం. ఇది సాధారణంగా మొక్క యొక్క పై భాగంలో కనిపిస్తుంది. ఊదా రంగు చారలు మరియు చిన్న ముదురు గోధుమ రంగు మచ్చలు కాండం మరియు యువ ఆకులపై కనిపిస్తాయి, కొన్నిసార్లు కేంద్రీకృత వలయాలు ఏర్పడతాయి. అవి ఒకదానితో మరొకటి కలిసిపోయినప్పుడు ఇవి ఆకు ఈనెల మధ్య కప్పేస్తాయి. చివరికి కణజాలాల నాశనానికి దారితీస్తాయి. కాండం మరియు ఆకు కాడలపైన ముదురు గోధుమ రంగు చారలు కనిపిస్తాయి. సాధారణంగా, ఎదుగుతున్న చిగుర్లు తీవ్ర కణ నాశనానికి గురవుతాయి. మొక్కల్లో ఎదుగుదల తగ్గి ఒక ప్రక్క మాత్రమే ఎదగవచ్చు. ఈ తెగులు తీవ్రంగా సోకిన మొక్కలలో, మచ్చలు పడిన లేత పచ్చ రింగులతో కూడిన మరియు ఉబ్బెత్తుగా వుండే మచ్చలతో అపరిపక్వ టొమాటో పండ్లు ఏర్పడతాయి. పండిన ఎర్రటి పండ్లపై పాలిపోయిన మచ్చలతో కూడిన గోధుమ రంగు వలయాలు మరియు మచ్చల వలన ఈ టమోటాలు అమ్మకానికి పనికి రావు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

వీటి లార్వాను లేదా ప్యుపాను లేదా తామర పురుగుల ప్యుపాను తినే కొన్ని రకాల కీటకాలు వాణిజ్యపరంగా అందుబాటులో వున్నాయి. పువ్వులను కాకుండా ఒక్క ఆకులపై మాత్రమే దాడిచేసే పురుగులను నియంత్రించడానికి, ముఖ్యంగా ఆకుల క్రింది భాగంలో, వేప నూనె లేదా స్పైనోసాడ్ లను వాడవచ్చు. ఈ వైరస్ ను నివారించడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి కానీ కొన్ని జాతుల సహజ శత్రువులపై (ఉదాహరణకు మైట్స్, స్పైనోసాడ్ ఈగల లార్వా, తేనెటీగలు) ఇవి విషప్రభావాన్ని చూపిస్తాయి. మొక్కలు పుష్పించే సమయంలో వీటిని వాడరాదు. ఫ్లవర్ తామర పురుగుల తెగుళ్లను నియంత్రించడానికి కొన్ని రకాల మైట్స్ ను లేదా పచ్చ లేస్ వింగ్స్ కీటకాలను ఉపయోగించవచ్చు. అల్లం కషాయాన్ని కొన్ని రకాల కీటక నాశినులతో కలిపి ఉపయోగించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవసంబంధమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తామర పురుగులు చాలా త్వరగా వీటి సంతతిని వృద్ధి చేసుకోవడం మరియు వీటి జీవిత చక్రం వలన ఇవి వివిధ రకాల పురుగులమందులకు నిరోధకతను ఏర్పరచుకున్నాయి. తగిలిన వెంటనే పురుగులు చనిపోయే అజాడిరచితిన్ లేదా పెరిథ్రోయిడ్స్ పురుగుల మందులను పెప్పరోనిల్ బుటాక్సైడ్ తో కలిపి వాడి ఈ పురుగులను నివారించవచ్చు.

దీనికి కారణమేమిటి?

టొమాటో మచ్చల విల్ట్ వైరస్ (TSWV) వెస్ట్రన్ ఫ్లవర్ త్రిప్స్(ఫ్రాంక్లినియెల్లా ఓక్సీడెంటలిస్), ఉల్లి తామర పురుగులు(త్రిప్స్ టబాసి)మరియు మిరప తామర పురుగులు( స్కిర్తోత్రిప్స్ డోర్సాల్లీస్) వంటి చాలా రకాల జాతుల తామర పురుగుల వలన సంక్రమిస్తుంది. TSWV తామర పురుగుల వంటి వాహకాలపైన కూడా చురుకుగా ఉంటాయి. తెగులు సోకిన మొక్కలను ఆహారంగా తిని ఈ వైరస్ ను వాటి జీవిత కాలమంతా ఇతర మొక్కలకు సంక్రమింపచేసి సామర్ధ్యంతో ఉంటాయి. కానీ ఈ TSWV ఈ వైరస్ సోకిన ఆడ పురుగుల ద్వారా గుడ్లకు సంక్రమించవు. ఈ వైరస్ కు టొమాటో, పండు మిరప, బంగాళా దుంప, లెట్టూస్ మరియు చాలా రకాల ఇతర మొక్కలు ఆతిధ్యం ఇస్తాయి.


నివారణా చర్యలు

  • తామర పురుగులు మరియు టొమాటోలో స్పాటేడ్ విల్ట్ వైరస్ TSWV లను సరిగా నియంత్రించే నిర్వహణ కలిగిన నర్సరీలలోని మొక్కలను ఉపయోగించండి.
  • ఈ తెగులుకు అతిథులుగా వుండే ఇతర మొక్కల వద్ద లేదా ఈ తెగులు సొకిన మొక్కల వద్ద పంటను సాగుచేయకండి.
  • తెగులు నిరోధక టొమాటో రకాలను ఉపయోగించండి.
  • వీటిని వాడడం వలన తామర పురుగుల నివారణ కోసం కీటక నాశినులు వాడనవసరం ఉండదు.
  • తామర పురుగుల ఉనికిని తెలుసుకోవడానికి నారు మొక్కలను క్షుణ్ణంగా తనిఖీ చేయండి.
  • వీటిని పట్టుకోవడానికి అధిక విస్తీర్ణంలో జిగురు వలలను వుపయోగించండి.
  • పొలంలో మరియు పొలం చుట్టూ ప్రక్కల కలుపు మొక్కలను తొలగించండి.
  • అధికంగా ప్రతిబింబించే అల్ట్రా వయొలెట్ కవర్లను మట్టిపై (లోహపు మల్చింగ్) ఈ తామర పురుగులను ప్రాలద్రోలండి.
  • తెగులు సోకిన మొక్కల భాగాలను మరియు మొక్కలను తొలగించి నాశనం చేయండి.
  • మొక్కలకు సరిపడా నీరు పెట్టండి మరియు అధిక మోతాదులో నత్రజని ఎరువులను వాడకండి.
  • పంటల మధ్యన విరామం సమయంలో గ్రీన్ హౌస్ లను ఆవిరితో శుభ్రం చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి