టమాటో

టమాటో పసుపు రంగు ఆకు ముడత వైరస్ (TYLCV)

TYLCV

వైరస్

5 mins to read

క్లుప్తంగా

  • పసుపు మరియు వంకర ఆకులు.
  • ఎదుగుదల తగ్గిపోతుంది.
  • పండ్ల సంఖ్య తగ్గుతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

టమాటో

లక్షణాలు

విత్తన దశలో ఈ తెగులు సంక్రమిస్తే ఆకులు మరియు రెమ్మల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీనివలన మొక్కలు గుబురుగా పెరుగుతాయి. పెద్ద మొక్కల్లో అధికంగా కొమ్మలు పెరగడం, లావుగా వంగిపోయినట్టుండే ఆకులు ఏర్పడడం మరియు ఆకులలో పచ్చదనం పోయి పాలిపోయినట్టు అవ్వడం జరుగుతుంది. పూత దశకంటే ముందు ఈ తెగులు సోకితే పండ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. పైకి మాత్రం ఈ తెగులు లక్షణాలు ఏమి కనిపించవు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

టమోటా పసుపు రంగు ఆకు ముడత వైరస్ కు ఎటువంటి జీవ నియంత్రణ పద్ధతులు లేవు. వైరస్ సంక్రమణను నివారించడానికి తెల్ల దోమ జనాభాను నియంత్రించండి

రసాయన నియంత్రణ

ఒకసారి ఈ వైరస్ సంక్రమించాకా ఈ వ్యాధికి వ్యతిరేకంగా ఎటువంటి చికిత్స లేదు. ఈ వైరస్ సంక్రమణను నివారించడానికి తెల్ల దోమ జనాభాను నియంత్రించండి. పెరిథ్రాయడ్ కుటుంబానికి చెందిన శీలింద్ర నాశినులను వాడడం లేదా నారుమడి వేసినప్పుడు పైన చల్లడం లాంటివి చేయడం వలన తెల్లదోమ సంతతిని తగ్గించవచ్చు కానీ ఈ మందులను ఎక్కువగా ఉపయోగించడం వలన తెల్ల దోమ వీటికి నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.

దీనికి కారణమేమిటి?

టమాటో పసుపు రంగు ఆకు ముడత వైరస్ తెగులు విత్తనాల మీద వ్యాపించే తెగులు కాదు మరియు పరికరాల వలన కూడా సోకదు. ఇవి బేమిసియా టబాసి జాతికి చెందిన తెల్ల దోమల వల్ల వ్యాపిస్తాయి. ఈ దోమలు ఆకుల కింది భాగాల పై దాడి చేస్తాయి మరియు లేతగా వున్న మొక్కలపట్ల ఆకర్షితులవుతాయి. మొత్తం సంక్రమణ 24 గంటల్లో జరిగిపోతుంది. పొడి వాతావరణం లేదా అధిక ఉష్నోగ్రతలు ఈ తెగులుకు అనుకూలంగా ఉంటాయి.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక విత్తన రకాలు వాడండి.
  • తెల్ల దోమ గరిష్ట జనాభాను నివారించడానికి ముందుగానే మొక్కలను నాటండి.
  • కీరదోసకాయ, గుమ్మిడి వంటి వ్యాధి సోకని మొక్కలతో పంటమార్పిడి చేయండి.
  • నారుమడులను కవర్ చేయడానికి వలలను ఉపయోగించండి మరియు మీ మొక్కలను చేరుకోకుండా తెల్ల దోమను నిరోధించండి.
  • మీ పంటలకు దగ్గరగా ప్రత్యామ్నాయ అతిధి మొక్కలను నాటకండి.
  • తెల్ల దోమ యొక్క జీవిత చక్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి నారుమడి లేదా పొలం లో రక్షణ కవచాన్ని( మల్చింగ్) ఏర్పాటుచేయండి.
  • వీటిని సామూహికంగా పట్టుకోవడానికి పసుపు జిగురు ప్లాస్టిక్ వలలను ఉపయోగించండి.
  • పొలాన్ని పర్యవేక్షిస్తూ వుండండి.
  • తెగులు సోకిన మొక్కలను చేతులతో తొలగించండి మరియు వాటిని పొలం నుండి దూరంగా పాతిపెట్టండి.
  • పొలంలో మరియు చుట్టుపక్కల కలుపు మొక్కలను నిర్మూలించండి.
  • పంట కోత తర్వాత అన్ని మొక్కల అవశేషాలను లోతుగా దున్నండి లేదా కాల్చివేయండి.
  • ఈ తెగులు సోకని మొక్కలతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి