వంకాయ

ఫ్లవర్ చాఫర్

Oxycetonia versicolor

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • దెబ్బతిన్న పువ్వులు మరియు మొగ్గలు.
  • ఈ పురుగులు తినడం వలన ఈ పురుగుల జనాభా అధికంగా సోకిన మొక్కలు చిరిగిపోయినట్లు కనిపిస్తాయి.

లో కూడా చూడవచ్చు


వంకాయ

లక్షణాలు

పునరుత్పత్తి అవయవాలకు నష్టం జరగడం వల్ల ఈ తెగులు గణనీయమైన దిగుబడి నష్టాన్ని కలిగిస్తుంది. పెద్ద పెంకు పురుగులు పువ్వుల లోపల పుప్పొడి, పూకాడలు మరియు ఇతర పునరుత్పత్తి భాగాలను తినడం ద్వారా పువ్వులు మరియు మొగ్గలను తినివేస్తాయి. పత్తిలో లేత కాయలపై కూడా దాడి చేస్తాయి. వంగ పంటల లేత రెమ్మలు మరియు వాటి అతిధేయ మొక్కల ఇతర లేత కణజాలాలను, ముఖ్యంగా అపరిపక్వ దశలో నమిలి తినడం గమనించబడింది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ప్రస్తుతం తెలిసిన జీవ చికిత్సలు ఏవీ లేవు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమగ్ర విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. ప్రస్తుతం తెలిసిన రసాయన చికిత్సలు ఏవీ లేవు.

దీనికి కారణమేమిటి?

చాఫర్ పెద్ద పురుగుల వల్ల నష్టం జరుగుతుంది. ఫ్లవర్ చేఫర్‌లు పగటిపూట ఎగిరే బీటిల్స్ మరియు ప్రధానంగా పుప్పొడి ని తింటాయి. మట్టిలోని సేంద్రియ పదార్ధాలలో గ్రబ్స్ అభివృద్ధి చెందుతాయి మరియు కొన్ని వేర్లకు సోకుతాయి, కానీ పంటకు తీవ్రమైన నష్టం కలిగించవు. పెద్ద పురుగులు 7 - 15 మిమీ పొడవు మరియు 5 - 7 మిమీ వెడల్పు కలిగివుంటాయి. ఆడ మరియు మగా పురుగులు ఒకేలా ఉంటాయి. వీటి శరీరం దగ్గరగా మరియు అండాకారంగా ఉంటుంది, సాధారణంగా కొద్దిగా చదునుగా ఉంటుంది, మరియు మంచి రంగులో ఉండి ఎక్కువగా నలుపు మరియు తెలుపు చారాలతో ఇటుక ఎరుపు రంగులో ఉంటుంది.


నివారణా చర్యలు

  • ఈ పెంకు పురుగు పంటల మధ్య వలసపోతుంది మరియు అనేక రకాల మొక్కలను ఆశిస్తుంది.పంటల నమూనాలను మార్చడం మరియు పురుగుమందుల నిరంతర వాడకం వల్ల తెగులు చిన్న తెగులు నుండి పెద్ద తెగులు స్థితికి మారవచ్చు.
  • భవిష్యత్తులో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ చాఫర్ బీటిల్‌ ని జాగ్రత్తగా పర్యవేక్షించడం మరియు సకాలంలో రిపోర్ట్ చేయడం అవసరం.
  • వంగ పంటలో, చిగురు మరియు పండ్ల తొలుచు పురుగుల నిర్వహణకు కాలానుగుణంగా క్రిమిసంహారక మందులను ఉపయోగించడం వల్ల బీటిల్ జనాభా నియంత్రణలో ఉంటుంది.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి