పొగాకు

యెల్లో స్టంట్

Fusarium/Pythium/Rhizoctonia complex

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులు పసుపు రంగులోకి మారతాయి ఆకు కొనలు ఎండిపోతాయి.
  • వేర్లు నలుపు రంగులోకి మారతాయి.
  • నేల పైభాగాన ఉన్న కాండం యొక్క కణజాలం నశిస్తుంది.
  • మొక్క చనిపోతుంది.
  • ఆకులపై కేంద్రీకృత రింగ్ నమూనాతో నిర్జీవ గాయాలు ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
పొగాకు

పొగాకు

లక్షణాలు

మొక్క పైభాగం ఎండిపోవడం ప్రారంభం కావడంతో వ్యాధి యొక్క ప్రారంభ లక్షణం కనిపిస్తుంది, తరువాత పసుపు రంగులోకి మారడం మరియు కణ నాశనం మొక్క చనిపోయేలా చేస్తుంది. వేరు వద్ద అధిక తేమ స్థాయిల వల్ల వేర్లకు గాలి అందని కారణంగా ఎల్లో స్టంట్ లేదా "ఎల్లో డిసీజ్ కాంప్లెక్స్" వ్యాధి ప్రేరేపించబడినట్లు అనిపిస్తుంది. ఈ సందర్భంలో, పొగాకు మొక్కల వేర్లు కుప్పకూలడం వలన అనేది ఎల్లో స్టంట్‌తో సంబంధం ఉన్న వ్యాధికారకాలు మొక్కలోకి చొచ్చుకుపోవడానికి అనుకూలంగా ఉంటుంది లేదా వాటి వ్యాధికారకాల దాడికి మొక్క గురయ్యే విధంగా గ్రహణశీలతను మారుస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

మట్టిలో వుండే వ్యాధికారక క్రిములకు నిరోధకత కలిగిన మొక్కల రకాలను ఉపయోగించండి

రసాయన నియంత్రణ

యెల్లో స్టంట్ వ్యాధిని రసాయనాలతో నియంత్రించలేము. నీటి నిర్వహణ సరిగా లేక వేర్ల వద్ద నీరు ఎక్కువగా నిలిచిపోవడం వలన ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

దీనికి కారణమేమిటి?

ఆక్సిజన్ లోటు మరియు అధిక కార్బన్ డయాక్సయిడ్ కి పొగాకు పంట తక్కువ సహన శీలతను కలిగి ఉంటుంది. మరియు అధిక తేమ, ఆక్సిజన్ లేకపోవడం మరియు అధిక ఉష్ణోగ్రతల కలయిక వేరు వ్యవస్థ కుప్పకూలిపోవడానికి కారణమవుతుంది. పొగాకు మొక్క వేర్లు కూలిపోవడం, ఎల్లో స్టంట్‌తో సంబంధం కలిగి వుండే ఫ్యూసేరియం ఎస్ పి పి., రైజెక్టోనియా సోలని, ఫైతియం ఎస్ పి పి., వంటి వ్యాధికారక జీవుల వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. . దీని పరిణామాలు వృద్ధి దశ, పర్యావరణ పరిస్థితులు, వ్యవధి మరియు ప్రభావిత వేర్ల శాతం వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటాయి.


నివారణా చర్యలు

  • నర్సరీలో, నారు పోసేటప్పుడు అధిక మొత్తంలో కాకుండా సరైన మోతాదులో విత్తనాలను ఉపయోగించండి.
  • విత్తే సమయంలో అధిక సాంద్రతతో మొక్కలను నాటకండి.
  • సరైన నీటిపారుదల నిర్వహణ వ్యవస్థను ప్రాక్టీస్ చేసి మట్టిలో నీరు నిల్వ ఉండకుండా సరైన స్థాయిలో నీటిని వాడండి.
  • సంపీడనం చెందిన మట్టిని మెత్తగా చేయడం ద్వారా నేల సంపీడనాన్ని నివారించండి.
  • పొలంలో ఎతైన మడులపై ఏర్పాటు చేసి వాటిపై మొక్కలను నాటండి.
  • ఆకుపచ్చని కవర్ పంటలు మట్టి నిర్మాణాన్ని మెరుగుపరుస్తాయి.
  • మట్టి ద్వారా సంక్రమించే వ్యాధికారక క్రిములను ఎక్కువగా తట్టుకునే విత్తన రకాలను ఉపయోగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి