గోధుమ

గోధుమ మరుగుజ్జు వైరస్

WDV

వైరస్

5 mins to read

క్లుప్తంగా

  • ఆగిపోయిన మొక్క ఎదుగుదల, పొదల మాదిరిగా ఎదుగుదల మరియు పిలకలు సంఖ్య తగ్గిపోవడం.
  • ఆకుల ఈనెలకు సమాంతరంగా రంగు కోల్పోయిన మచ్చలు కనిపిస్తాయి.
  • తరువాత ఈ మచ్చలు మొత్తం ఆకును చుట్టుముడతాయి.
  • తక్కువ కంకులు ఏర్పడడం మరియు వాటిలి తక్కువ పరిమాణంలో గింజలు ఉండడం కొన్నిసార్లు అసలు గింజలు లేకపోవడం జరుగుతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

గోధుమ

లక్షణాలు

గోధుమ మరుగుజ్జు వైరస్ వలన మొక్కలలో ఎదుగుదల తగ్గడం, ఒక పొదలాగా పెరగడం మరియు ఆకులు మరియు పిలకలు రావడం తగ్గడం లాంటి తీవ్రమైన లక్షణాలకు కారణమవుతుంది. పాలిపోయిన క్లోరోటిక్ మచ్చలు ఆకు మొత్తం ఆవరించి ఉంటాయి. కంకులు తక్కువగా వస్తాయి మరియు అప్పటికే ఉన్న కంకులలో గింజలు చిన్నగా ఉండడం లేదా అసలు గింజలు లేకపోవడం జరుగుతుంది. ఈ వైరస్ సామ్మోటేట్టిక్స్ అలైనస్ వాహకమైన లీఫ్ హాపర్ అనే క్రిమి ద్వారా సంక్రమిస్తుంది. ఇది దీని నోటి భాగాలతో గోధుమ యొక్క ఏపుగా పెరిగిన భాగాల నుంచి కణ ద్రవ్యాన్ని పీల్చి ఈ వైరస్త సోకేటట్టు చేస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ వైరస్ ను నియంత్రించడానికి ఎటువంటి జీవ నియంత్రణ చర్యలు లేవు. మీకు ఏవైనా తెలిస్తే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మీ నుండి వినడానికి మేము ఎదురు చూస్తున్నాము.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులును వ్యాపింపచేసే కీటకాలు అధిక మొత్తంలో పొలంలో వున్నప్పుడు మాత్రమే కీటక నాశినులను సిఫార్సు చేస్తారు. ఇమిడక్లోప్రిడ్ తో చేసే విత్తనాల చికిత్స వీటిని బాగా నియంత్రిస్తుంది. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు గోధుమ మొక్కలపై పెరిథ్రోయిడ్ లేదా ఇతర కీటక నాశినులను ప్రయోగించవచ్చు.

దీనికి కారణమేమిటి?

లీఫ్ హాపర్ అనే వైరస్ వాహకం ద్వారా నిరంతర పద్ధతిలో వ్యాప్తి చెందే సామ్మోటేట్టిక్స్ అలైనస్ వైరస్ వలన ఈ లక్షణాలు ప్రేరేపించబడతాయి. అయితే వైరస్ లేని హాపర్స్ మొక్కలను తినడం వలన ఎటువంటి తెగులు సంక్రమించదు. వైరస్ ఈ కీటకాలనుండి మొక్కకు చేరడానికి మొక్కలను కొన్ని నిమిషాల పాటు ఈ కీటకాలు పీల్చవలసి వుంటుంది. పి. అలైనస్ సంవత్సరానికి 2-3 తరాల కీటకాలను ఉత్పత్తి చేస్తుంది, శరదృతువులో శీతకాలం గోధుమ రకాలను మరియు వసంత కాలములో వేసవి గోధుమ రకాలను సంక్రమిస్తుంది. లీఫ్ హాపర్లు శీతాకాలములో గుడ్లలాగా వుండి మే నెలలో చిన్న పురుగులు లాగ రూపాంతరం చెందుతాయి. ఈ వైరస్ గుడ్లకు మరియు లార్వా యొక్క మొదటి దశ అయిన చిన్న పురుగులకు వ్యాపించదు. ఇది బార్లీ, వోట్లు మరియు వరి వంటి ఇతర తృణధాన్యాలకు కూడా వ్యాపిస్తుంది.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే తెగులు నిరోధక రకాలను ఉపయోగించండి.
  • ప్రతి రోజూ పొలంలో ఆకులు, కాడలు, మరియు రెమ్మలలో కీటకాల కోసం చూడండి.
  • ఈ తెగులు వాహకాలను నిరోధించడానికి తెగులు సోకిన మొక్కల భాగాలనుచేతితో తీసివేయండి.
  • కలుపు మొక్కలు మరియు ప్రత్యామ్నాయ అతిధి మొక్కలను తొలగించటం ద్వారా పొలంలో మంచి శుభ్రతను పాటించండి.
  • పంటకోత తర్వాత మొక్కల అవశేషాలను తొలగించండి.
  • ఈ కీటకాల జనాభా బాగా పెరగకుండా ఉండడానికి మొక్కలను త్వరగా నాటండి.
  • సంక్రమణముకు అడ్డుకట్టవేసేందుకు మరియు మొక్కలకు సత్తువ కలగచేయడానికి మామూలుగా వేసే సమయం కన్నా ముందుగా ఎరువులను వేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి