కాప్సికమ్ మరియు మిరప

అల్ఫాల్ఫా మొజాయిక్ వైరస్

AMV

వైరస్

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులపై ప్రకాశవంతమైన పసుపు రంగు మచ్చలు మరియు మొజాయిక్ మచ్చలు ఏర్పడతాయి.
  • కాంస్య రంగు లోనికి మారడం.
  • పండ్లపై రింగుల వంటి నిర్జీవ కణజాలం మరియు మచ్చలు.


కాప్సికమ్ మరియు మిరప

లక్షణాలు

ఆకులపై ప్రకాశవంతమైన పసుపు రంగు మచ్చలు లేదా మొజాయిక్ మచ్చలు ఏర్పడతాయి, ఆకులు కాంస్య రంగు లోనికి మారుతాయి. పండ్లపై రింగుల వంటి నిర్జీవ కణజాలం మరియు మచ్చలు ఏర్పడతాయి. వేర్లలోని ఫ్లోయమ్‌తో సహా ఫ్లోయమ్ కణజాలం నిర్జీవంగా మారి మొక్క చనిపోవడం జరుగుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

పేనుబంక ద్వారా సంక్రమించే వైరస్‌ల ద్వారా సంక్రమణని ఆలస్యం చేయడానికి వెండి రిఫ్లెక్టివ్ మల్చ్‌లను ఉపయోగించండి మరియు ఈ వ్యాధుల సంభవం మరియు తీవ్రతను తగ్గించడం ద్వారా వాటిని వ్యాప్తి చేసే పేనుబంకను నియంత్రించండి. మొక్కలకు పేనుబంక సోకకుండా చేయడానికి మరియు వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి విత్తనాలు నాటడానికి లేదా మార్పిడికి ముందు మడులపై రిఫ్లెక్టివ్ పాలిథిలిన్ మల్చ్‌లను అమర్చండి.

రసాయన నియంత్రణ

నివారణ చర్యలు మరియు అందుబాటులో ఉన్న జీవ చికిత్సలతో కూడిన సమగ్ర విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. ప్రస్తుతం సమర్థవంతమైన రసాయన నియంత్రణ వ్యూహాలు అందుబాటులో లేవు. పేనుబంక వాహకాలను నియంత్రించడానికి ఉద్దేశించిన పురుగుమందులు దీనిపై పనిచేయవు.

దీనికి కారణమేమిటి?

విత్తనం ద్వారా సంక్రమించే వైరస్ వల్ల నష్టం జరుగుతుంది, ఇది వ్యాధి సోకిన విత్తనం లేదా మొక్కలలో జీవించి ఉంటుంది. పేనుబంక వ్యాధి సోకిన మొక్కల విత్తనాల నుండి ఆరోగ్యకరమైన మొక్కలకు వైరస్ వ్యాప్తి చేసినప్పుడు ద్వితీయ సంక్రమణ జరుగుతుంది. పేనుబంక ఈ వైరస్‌ను పొందిన తర్వాత, అది వైరస్‌ను కొద్ది కాలం మాత్రమే మొక్కలకి సంక్రమింపచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మరియు వ్యాప్తి వేగంగా మరియు స్థానికంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • ఆరోగ్యకరమైన విత్తనాలను ఉపయోగించండి మరియు సరైన విత్తన రేటుతో సీజన్లో ముందుగానే విత్తండి.
  • వ్యాధి సోకిన అల్ఫాల్ఫా పొలాలకి దగ్గర్లో టమోటా పంటను వేయకండి.
  • టొమాటో పంట వేసిన పొలాల దగ్గర అల్ఫాల్ఫాను కలిగి ఉన్న ఇన్సెక్టరీ మొక్కలను ఉపయోగించకండి.
  • సరైన కలుపు నిర్వహణను ప్రాక్టీస్ చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి